దీపావళి బహుమతి... కోరియర్ సంస్థకు భారీ జరిమానా

By telugu teamFirst Published Nov 4, 2019, 11:42 AM IST
Highlights

 కొరియర్ చేయడానికి దాదాపు రూ.4,500లు ఆ కొరియర్ కంపెనీకి పంపినట్లు ఆయన చెప్పారు. కొరియర్ అందలేదని ఇప్పటి చాలాసార్లు ఫిర్యాదు చేసినా... సదరు కొరియర్ సంస్థ సరిగా స్పందించలేదని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఓ కొరియర్ సంస్థకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. దీపావళి బహుమతులను సరిగా డెలివరీ చేయని కారణంతో...ఓ కొరియర్ సంస్థకు రూ.45వేల జరిమానా విధించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న కుమార్తెకు మూడు సంవత్సరాల క్రితం చెన్నైకి చెందిన ఓ వ్యక్తి దీపావళి పండగను పురస్కరించుకొని చీర, స్వీట్ల్, స్నాక్స్, గిఫ్ట్స్ కొరియర్ చేశాడు. అయితే.... అవి ఆమెకు చేరకపోవడం గమనార్హం. 

దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానానికి పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ లో అమెరికాలో ఉన్న తన కుమార్తె కోసం చీర, టాప్స్, పెట్టికోట్, స్వీట్లు, స్నాక్స్ పంపించినట్లు చెప్పాడు. తన కుమార్తెకు పంపిన చీర ఖరీదు రూ.11,850 అని చెప్పారు. అంత ఖరీదైన చీరను కొరియర్ చేస్తే... మూడు సంవత్సరాలైనా అది తన కుమార్తెను చేరలేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

అవన్నీ కొరియర్ చేయడానికి దాదాపు రూ.4,500లు ఆ కొరియర్ కంపెనీకి పంపినట్లు ఆయన చెప్పారు. కొరియర్ అందలేదని ఇప్పటి చాలాసార్లు ఫిర్యాదు చేసినా... సదరు కొరియర్ సంస్థ సరిగా స్పందించలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. చాలాసార్లు మెయిల్ చేసిన తర్వాత.... అడ్రస్ తప్పుగా వచ్చిందని... కొరియర్ వేరేవాళ్లకు అందిందని సంస్థ పేర్కొందని చెప్పారు. మళ్లీ తిరిగి తమ కుమార్తెకు పంపుతామని చెప్పారని.. కానీ పంపలేదని ఆయన వాపోయారు. 

దాదాపు 2016 నవంబర్ 9వ తేదీన నోటిసులు పంపినప్పటికీ,... వాళ్ల వద్ద నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాడు. అతని పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం సదరు కొరియర్ సంస్థకు భారీ జరిమానా విధించింది. మొత్తం రూ.45వేల జరిమానా విధించి... ఆ డబ్బులు కొరియర్ పంపిన వ్యక్తికి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

click me!