ఢిల్లీలో ఇంటి పనిమనిషితో సహా దంపతుల హత్య.. ఉదయం 7.30కి పనికి వచ్చిన మహిళ...

Published : Nov 01, 2022, 01:16 PM IST
ఢిల్లీలో ఇంటి పనిమనిషితో సహా దంపతుల హత్య.. ఉదయం 7.30కి పనికి వచ్చిన మహిళ...

సారాంశం

ఢిల్లీలో ఓ దంపతులు హత్య చేయబడ్డారు. వారితో పాటు ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా హత్యకు గురయ్యింది. అయితే వారి రెండేళ్ల పాప మాత్రం క్షేమంగా ఉంది. 

న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ దంపతులతో పాటు వారి ఇంటి పనిమనిషి హత్యకు గురయ్యింది. ఆ వీరిని సమీర్ అహుజా, అతని భార్య షాలుగా గుర్తించారు. అయితే వారి రెండేళ్ల పాప మాత్రం క్షేమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఢిల్లీలోని కౌపైల్ అశోక్ విహార్ లోని దంపతుల ఇంట్లో హత్యలు జరిగినట్లు అధికారులు తెలిపారు. 

వారింట్లో పనిచేస్తున్న మహిళ స్వప్న మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దంపతుల ఇంటికి వచ్చింది. ఆ తర్వాత హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు మోటార్‌బైక్‌పై వారి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?