బాత్రూమ్‌లో దంపతుల మృతదేహాలు.. హోలీ పార్టీ తర్వాత విగత జీవులై..!

Published : Mar 10, 2023, 06:26 PM IST
బాత్రూమ్‌లో దంపతుల మృతదేహాలు.. హోలీ పార్టీ తర్వాత విగత జీవులై..!

సారాంశం

ముంబయిలో హోలీ పార్టీ చేసుకున్న తర్వాత ఓ జంట ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం, ఆ దంపతులు బాత్రూమ్‌లో విగత జీవులై కనిపించారు.  

ముంబయి: మహారాష్ట్రలో ఓ దంపతులు బాత్రూమ్‌లో విగత జీవులై కనిపించారు. ముంబయిలోని ఘాట్‌కోపర్ ఏరియాలో ఈ ఘటన బుధవారం జరిగింది. మిస్టరీ పరిస్థితుల్లో వారు మరణించి కనిపించారు. హోలీ వేడుక చేసుకున్న తర్వాత ఆ కంపుల్ ఇలా మరణించి కనిపించడం గమనార్హం.

ఘాట్‌కోపర్ ఏరియాలోని కుక్రేజా బిల్డింగ్‌లో ఆ దంపతులు (భర్తకు 42 ఏళ్లు, భార్యకు 39 ఏళ్ల వయసు) ఉండేవారు. వారి మరణానికి గల కారణాలు ఇప్పటికైతే తెలియరాలేదు.

హోలీ పార్టీ చేసుకుని ఇంటికి వచ్చిన ఆ దంపతులు బాత్రూమ్‌లో మరణించి కనిపించారు. ఇంట్లో పని మనిషి వారిని ఇలా చూసింది. ఆమె వద్ద ఆ బిల్డింగ్ డూప్లికేట్ తాళాలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి వెళ్లగానే బాత్రూమ్‌లో వారు మరణించిన స్థితిలో కనిపించారు. వెంటనే ఆమె వారి బంధువులకు విషయం చేరవేసింది. వారు పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు.

Also Read: భారత్‌లో హెచ్3ఎన్2తో రెండు మరణాలు.. కేంద్రం అప్రమత్తం, రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు

ఆ దంపతులు బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో నివసించేవారని పోలీసులు తెలిపారు. వారి బంధువులు కొందరు సమీప బిల్డింగ్‌లలో ఉంటున్నారని చెప్పారు. యాక్సిడెంట్ డెత్‌గా పంత్ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు డీసీపీ పురుషోత్తమ్ కరద్ తెలిపారు. ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించినట్టు వివరించారు. 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?