మద్యం తాగొచ్చి వేధింపులు: తమిళనాడులో కొడుకును హత్య చేసిన పేరేంట్స్

Published : Jan 30, 2022, 10:14 AM IST
మద్యం తాగొచ్చి వేధింపులు: తమిళనాడులో కొడుకును హత్య చేసిన పేరేంట్స్

సారాంశం

మద్యం తాగి వేధింపులకు గురి చేస్తున్నాడని  కొడుకును తల్లిదండ్రులు హత్యచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై: Liquor తాగొచ్చి  వేధిస్తున్నాడని Sonను పేరేంట్స్ హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

Tamil Naduలోని Arapalayam గ్రామానికి చెందిన Manimaran అనే వ్యక్తిని తల్లిదండ్రులే హత్య చేశారు. మణిమారన్ వయస్సు 43 ఏళ్లు. కరిమేడు పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Murugesan, Krishnaveni దంపతుల కొడుకే మణి మారన్.  మణిమారన్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో ప్రతి రోజూ మద్యం తాగొచ్చి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాదు వారిని దూషించేవాడు. వారితో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.

ఈ నెల 27వ తేదీ రాత్రి కూడా మణిమారన్ మద్యం తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహం పట్టలేక మురుగేషన్ ఆయన భార్య కర్ర, రాడ్ తో మణిమారన్ ను తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక మణిమారన్ మరణించాడు..  మురుగేషన్ దంపతులు గోనెసంచిలో మణిమారన్ మృతదేహన్ని కట్టి  Bicycle పై వైగే నది సమపంలో దగ్దం చేశారు. అయితే ఈ మృతదేహం సగం మాత్రమే కాలిపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి మణిమారన్ గా పోలీసులు గుర్తించారు.  మణిమారన్ చనిపోయిన విషయాన్ని పోలీసులు మురుగేషన్ ను ప్రశ్నిస్తే మణిమారన్ ను  హత్య చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?