గుడ్ న్యూస్ : తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. పెరిగిన రికవరీ రేటు...

Published : Aug 09, 2021, 11:04 AM IST
గుడ్ న్యూస్ : తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. పెరిగిన రికవరీ రేటు...

సారాంశం

అందుకు నిర్థారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లు చేరగా.. 4.28 లక్షల మంది మరణించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

దేశంలో కరోనా వ్యాప్తి కొద్దిమేర తగ్గింది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. ఆదివారం 13,71,871 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 35,499 మందికి పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 9 శాతం మేర క్షీణించాయి. 

అందుకు నిర్థారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లు చేరగా.. 4.28 లక్షల మంది మరణించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

క్రియాశీల కేసుల సంఖ్యం 4.02,188 (1.26)గా ఉంది. నిన్న 39 వేల మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్ ను జయించినవారి సంఖ్య 3.11 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.40శాతానికి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిన్న 16,11,590 మంది టీకాలు వేయించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్