కరోనా డేంజర్ బెల్స్: ఒకే రోజు 75 వేల కేసులు, దేశంలో 33 లక్షల మార్కు క్రాస్

By team teluguFirst Published Aug 27, 2020, 12:53 PM IST
Highlights

గడిచిన 24 గంటల్లో భారత్ లో అత్యధికంగా 75వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీనితో భారతదేశంలో కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. 

కరోనా మహమ్మారి ధాటికి భారత్ బెంబేలెత్తిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో అత్యధికంగా 75వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీనితో భారతదేశంలో కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. 

నిన్నొక్కరోజే 75,760 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 33,10,234 కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1023 మంది కరోనా బారినపడి మరణించారు. దీనితో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 60,472 కి చేరుకుంది. 

కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్యా కూడా 25 లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు 25,23,771 మంది కరోనా నుండి కోలుకున్నారు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత రికవరీ రేటు 76. శాతంగా ఉంది. కరోనా మరణాల శాతం కూడా 1.83 శాతానికి పడిపోయింది. 

ప్రస్తుతానికి 7,25,991 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఆగష్టు 7వ తేదీన భారత్ లో కరోనా కేసులు 20 లక్షలను దాటగా, 23వ తేదీనాటికే 30 లక్షల మార్కును దాటేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ విపరీతంగా ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 14 వేల 483కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ వ్యాధితో 8 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 788కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వ్యాధి నుంచి 872 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 86095కు చేరుకుంది. తెలంగాణలో ఇంకా 27,600 యాక్టివ్ కేసులున్నాయి.

click me!