COVID -19 : మళ్లీ పెరిగిన కొత్త కేసులు, 284 మరణాలు..

Published : Sep 15, 2021, 10:25 AM IST
COVID -19 : మళ్లీ పెరిగిన కొత్త కేసులు, 284 మరణాలు..

సారాంశం

క్రితం రోజుతో పోల్చితే రోజువారీ కేసుల్లో 7 శాతం పెరుగుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కేసుల సంఖ్య 30 వేలకు దిగువనే నమోదయ్యింది. 

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం... 27,176 కొత్త కేసులు, 284 మరణాలు సంభవించాయి. 

క్రితం రోజుతో పోల్చితే రోజువారీ కేసుల్లో 7 శాతం పెరుగుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కేసుల సంఖ్య 30 వేలకు దిగువనే నమోదయ్యింది. కేరళలో 15,876, మహారాష్ట్రలో 3,530 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. సగానికి పైగా కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకు 3.33 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.25 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 38,012 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3.51 లక్షల మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 97.62 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 1.05 శాతానికి తగ్గింది. మృతుల సంఖ్య 4,43,497కి చేరింది. 

మరోపక్క నిన్న 61,15,690 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంక్య 75,89,12,277కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport