కరోనా అప్ డేట్ : దేశంలో కొత్తగా 24 గంటల్లో 23,950 కేసులు

By AN TeluguFirst Published Dec 23, 2020, 12:00 PM IST
Highlights

భారత్ లో కరోనా కలకలం రేపుతూనే ఉంది. వైరస్ వ్యాప్తిలో పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. కరోనా కేసుల సంఖ్యలో రోజురోజుకు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే భయపడాల్సింది ఏమీ లేదని వ్యాది అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. 

తాజాగా దేశంలో కేసుల సంఖ్య కోటి 99 వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,950 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 333 మంది మృద్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,00,99,066కు చేరింది. ఇప్పటి వరకు 1,46,444 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నిన్న ఒక్కరోజు 26,895 మంది డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 96,63,382 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,89,240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు1.49, , రికవరీ రేటు 95.69, యాక్టివ్‌ కేసుల రేటు 2.86గా ఉన్నాయి. 

click me!