
Covid-19: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలపై దృష్టి పెట్టాలని, టీకా వేగాన్ని పెంచాలనీ, కోవిడ్-తగిన ప్రవర్తనను అనుసరించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏడు రాష్ట్రాలకు లేఖ రాసింది. వాటిలో ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. రాబోయే వారాల్లో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే పండుగలు, వేడుకలు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను పెంచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
"రోగ లక్షణాలలో కొన్ని మార్పులు, వ్యాధి క్లినికల్ వ్యక్తీకరణల దృష్ట్యా, ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం కోసం, మార్గదర్శకాల ప్రకారం అన్ని ఆరోగ్య సౌకర్యాలలో జిల్లాల వారీగా ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), SARI కేసులను పర్యవేక్షించడం, సంక్రమణ వ్యాప్తిని నివేదించడం చాలా ముఖ్యం. ఇది ఏదైనా ఆందోళన కలిగించే ప్రాంతాల్లో అవసరమైతే ముందస్తు చర్య తీసుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది” అని భూషణ్ చెప్పారు. ఇదిలావుండగా, ఢిల్లీ శనివారం 2,311 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. కరోనా టెస్ట్ పాజిటివ్ రేటుతో 13.84 శాతానికి పెంచింది. గత వారంలో భారతదేశంలోని వారపు కొత్త కేసులలో ఢిల్లీ 8.2% వాటాను కలిగి ఉందని లేఖ పేర్కొంది. కాగా, కేరళలో గత నెలలో రోజుకు సగటున 2,347 కేసులు, మహారాష్ట్రలో 2,135 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
"మార్కెట్లు, అంతర్ రాష్ట్ర బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు మొదలైన రద్దీ ప్రదేశాలలో కోవిడ్-తగిన ప్రవర్తనను నిర్ధారించడంపై కొత్త శ్రద్ధ అవసరం" అని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణీకుల నిర్దేశిత నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు సెంటినెల్ సైట్‌ల నుండి నమూనాల సేకరణ, కొత్త కోవిడ్ -19 కేసుల స్థానిక క్లస్టర్ కూడా సమానంగా ముఖ్యమైనదని, అటువంటి నమూనాలను రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా నియమించబడిన ల్యాబ్‌కు పంపాలని భూషణ్ చెప్పారు. భారతదేశంలో శనివారం 18,667 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కాగా, తెలంగాణలోనూ రోజురోజుకూ కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతూ కలవరం రేపుతున్నాయి. అయితే, గత ఐదు రోజులతో పోలిస్తే.. తెలంగాణలో తాజాగా రోజువారి కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 652 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో శనివారం కోవిడ్-19 కేసులు బాగా తగ్గాయి. గత నాలుగు రోజుల్లో రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 990 నుండి 1,000 కంటే అధికంగా నమోదయ్యాయి. అయితే శనివారం 652 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆగస్టు 2 నుండి 5 వరకు రోజువారీ పరీక్షలు దాదాపు 40,000 నుండి 44,000 వరకు నిర్వహించారు. శనివారం 40,451 నమూనాలను పరీక్షించారు. ఇంకా 769 ఫలితాలు రావాల్సి ఉంది. కొత్తగా నమోదైన 652 కేసుల్లో హైదరాబాద్‌లో 220, రంగారెడ్డిలో 46, మేడ్చల్ మల్కాజిగిరిలో 41 కేసులు నమోదయ్యాయి.