New Delhi: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజస్థాన్ లో బీజేపీ తన 'జన ఆక్రోష్ యాత్ర'ను నిలిపివేసింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 1 న కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రైతులు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికి.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ 'జన ఆక్రోష్ యాత్ర' ను ప్రారంభించారు.
Covid-19 surge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన తన "జన ఆక్రోష్ యాత్ర" ను నిలిపివేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 1 న కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రైతులు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికి.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ 'జన ఆక్రోష్ యాత్ర' ను ప్రారంభించారు.
'కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో జన ఆక్రోష్ యాత్రను బీజేపీ నిలిపివేసింది. బీజేపీకి రాజకీయాల కంటే ముందు ప్రజలు ముందుంటారు. ప్రజల భద్రతకు, వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం' అని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఉదయం, సాయంత్రం నడకగా అభివర్ణిస్తూ, పార్టీ రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని సింగ్ ఆరోపించారు. "కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' ఫ్లాప్ షో. ఇది ఉదయం సాయంత్రం నడక తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన చిల్లర రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం తగదు" అని ఆయన అన్నారు.
undefined
గురువారం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఫేస్ మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించడం గురించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతున్న స్వభావం ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా ఉందనీ, ఇది వాస్తవంగా ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తుందని మాండవియా లోక్ సభలో ఒక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 5.87 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, భారతదేశంలో ప్రతిరోజూ సగటున 153 కొత్త కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు.
BJP suspends its Jan Aakrosh Yatra in Rajasthan in wake of COVID-19: Party General Secretary Arun Singh
— Press Trust of India (@PTI_News)
కాగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరగుతున్నాయి. జపాన్, చైనా, అమెరికా, సహా పలు ఆసియా దేశాల్లో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఇటీవల గుర్తించిన కొత్త వేరియంట్లే కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నాయి. తాజాగా సంబంధిత వేరియంట్లు భారత్ లోనూ వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన కరోనా పరిస్థితులపై సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం గురువారం నాడు కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమయ్యాయి. కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి.