coronavirus : మూడు వారాల్లో భారీగా కేసులు పెరిగే అవకాశం.. కేరళ ఆరోగ్య మంత్రి హెచ్చరిక

By team telugu  |  First Published Jan 16, 2022, 11:01 AM IST

వచ్చే మూడు వారాల్లో కేరళలో భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చ‌రించారు. ఎవరూ ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. శ‌నివారం సాయంత్రం ఆమె మీడియాతో స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు.


వచ్చే మూడు వారాల్లో కేరళలో (kerala) భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (health minister veena george) హెచ్చ‌రించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఆమె మీడియాతో స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 78 కోవిడ్ క్ల‌స్ట‌ర్లు ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌తీ రోజు రాష్ట్రంలో కోవిడ్ -19 (covid -19) కేసులు పెరుగుతున్నాయ‌ని అన్నారు. దీంట్లో డెల్టా (delta), ఒమిక్రాన్ (omicron) కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌రో రెండు, మూడు వారాల్లో మ‌రిన్ని కేసులు పెర‌గ‌వ‌చ్చ‌ని తెలిపారు. కేర‌ళ రాష్ట్రంలోని అధికార సీపీఐ(ఎం) తో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కోవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆరోగ్య శాఖ చూస్తోంద‌ని తెలిపారు. 

ఇటీవల సీపీఐ(ఎం) జిల్లా సమావేశంలో భాగంగా తిరువాతిర నృత్య ప్రదర్శన నిర్వ‌హించారు. దీనిపై పెద్ద రాజ‌కీయ వివాదం చ‌ల‌రేగింది. అధికార పార్టీ నాయ‌కులు కోవిడ్ ప్రోటోకాల్‌లను (covid protocal) ఉల్లంఘించార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆ కార్యక్ర‌మం ఏర్పాటు చేసిన వారిపై కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులు న‌మోదు చేయాల‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Latest Videos

undefined

కేర‌ళ‌లో 15-18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజ‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 51 శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించామ‌ని ఆరోగ్య‌మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 7,66,741 మంది పిల్లలు వ్యాక్సిన్ పొందార‌ని ఆమె అన్నారు. ఇందులో త్రిసూర్ జిల్లాలో అత్యధికంగా 97,458 మంది పిల్లలకు ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశార‌ని ప్ర‌క‌టించారు. 

రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీల్లోని టీనేజ‌ర్ల కోసం జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ను (vaccination drive) నిర్వహిస్తున్నారు.  అయితే జన‌వ‌రి 10వ తేది నుంచి కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ప్రికాష‌న‌రీ డోసు అందించ‌డం ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,67,813 మంది వ్యక్తులు ఈ ప్రికాష‌న‌రీ డోసు పొందారు. వీరిలో 96,946 మంది ఆరోగ్య కార్యకర్తలు, 26,360 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు,  44,507 మంది వ్యక్తులు 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు ఉన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. కేర‌ళ‌లో కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో రెండు వారాల పాటు స్కూళ్ల‌ను మూసి వేస్తున్న‌ట్టు విద్యా శాఖ మంత్రి వి.శివ‌న్ కుట్టి (education minister v.shivan kutti) శనివారం ప్ర‌క‌టించారు. 
ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా త‌ర‌గ‌తుల‌ను నిలిపివేస్తున్నామని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వానికి పిల్ల‌ల భద్రత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని అన్నారు. అందుకే ఆన్ లైన్ ద్వారా క్లాసులు కొన‌సాగించాల‌ని తెలిపారు. దాని కోసం టైం టేబుల్ (time table) రూపొందిస్తామ‌ని అన్నారు. అయితే 10, 11, 12 తరగతుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని చెప్పారు. వారిని క‌రోనా (corona) నుంచి కాపాడేందుకు కూడా త‌గిన ఏర్పాట్లు చేస్తామ‌ని మంత్రి అన్నారు. 
 

click me!