దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. భారతదేశంలో ఆదివారం ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటింది. మరణాల సంఖ్య 500కు పైగా నమోదైంది.
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. మరణాల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 15,707కు చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,329 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరణాల సంఖ్య 507కు చేరుకుంది. కొత్తగా 27 మరణాలు సంభవించాయి.
మొత్తం నమోదైన కేసుల్లో 12,969 యాక్టివ్ కేసులు కాగా, 2,230 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 239 కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 14.20 శాతం మంది కోలుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో కొత్త 47 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 612కు చేరుకుంది.
దేశంలోని 12 రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ శనివారం చెప్పిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల సంఖ్య 159,510కి చేరుకున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,317,759కి చేరుకుంది.