ఇండియాపై కరోనా పంజా:కోవిడ్ మరణాలలో టాప్‌టెన్‌లో భారత్‌కి చోటు

By narsimha lodeFirst Published Jun 14, 2020, 10:45 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శనివారం నాడు ఒక్క రోజునే దేశ వ్యాప్తంగా 311 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 9195కి చేరుకొన్నాయి.


న్యూఢిల్లీ:  ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శనివారం నాడు ఒక్క రోజునే దేశ వ్యాప్తంగా 311 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 9195కి చేరుకొన్నాయి.

శనివారం నాడు ఒక్కరోజునే దేశంలో సుమారు 11,927 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరగడంపై  అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ  కరోనా పరిస్థితులపై  శనివారం నాడు  సమీక్ష నిర్వహించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. 

ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, పుణె, ఇండోర్, కోల్ కత్తాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కూడ కరోనా రోగుల్లో కోలుకొంటున్నవారి సంఖ్య అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీ నివేదిక తెలుపుతోంది. 

కరోనా మరణాల్లో ఇండియా టాప్ టెన్ స్థానాల్లోకి చేరుకొంది. అమెరికా, బ్రెజిల్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికో, బెల్జీయం తర్వాత ఇండియా నిలిచింది.

దేశంలో కరోనా వైరస్ కేసులు 3,20,922కి చేరుకొన్నాయి. వీటిలో 1,49,348 యాక్టివ్ కేసులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకిన వారిలో 1,62,379 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో 9195 మంది మరణించారు. 

కరోనా కేసుల వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ జైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు.

బీహార్ రాష్ట్రంలో కరోనా కేసులు 6,289కి చేరుకొన్నాయి. శనివారం నాడు 193 కొత్త కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రంలో కూడ 1,711 కేసులు నమోదయ్యాయి.  శనివారం నాడు 54 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 

click me!