విజృంభణ: ఇండియాలో 70 వేల మార్కు దాటిన కరోనా కేసులు

Published : May 12, 2020, 09:17 AM ISTUpdated : May 12, 2020, 02:15 PM IST
విజృంభణ: ఇండియాలో 70 వేల మార్కు దాటిన కరోనా కేసులు

సారాంశం

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. కరోనా వైరస్ మరణాలు రెండు వేల పైనే ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 3,604 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో దేశంలో 87 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,2293కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 22445 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008 ఉంది.  

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేల 17వ తేదీ వరకు విధించిన లాక్ డౌన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడారు. లాక్ డౌన్ ను కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదు కాని ప్రాంతాల్లో ఆంక్షలను మరింతగా సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ 15 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!