చైనాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ఆ దేశానికి తెలిపింది. ముఖ్యంగా కోవిడ్ ముప్పు అధికంగా ఉండే వారికి టీకాలు వేయాలని కోరింది.
చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆ దేశానికి సూచించింది. ఈ మేరకు డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం వీక్లీ మీడియా సమావేశంలో మాట్లాడారు. చైనాలో కోవిడ్ కేసుల విషయంలో తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. కోవిడ్ నుంచి రక్షణ కల్పించే టీకాలు వేగంగా వేయాలని, ముందుగా కరోనా ముప్పు అధికంగా ఉండే వారికి అందజేయాలని సూచించారు.
undefined
‘‘ చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది’’ అని తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా (చైనాలో) అత్యధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు టీకాలు అందించేందుకు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. క్లినికల్ కేర్, దాని హెల్త్ సిస్టమ్ ను రక్షించేందుకు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. కరోనా మహమ్మారి మొదలైన నాటి 2020 నుంచి చైనా కఠినమైన ‘జీరో కోవిడ్ పాలసీ’ని అమలు చేస్తోంది. దీని వల్ల ఇంత కాలం ఆ దేశంలో కోవిడ్ కంట్రోల్ లో ఉంటూ వచ్చింది. కానీ పెరుగుతున్న ప్రజల్లో పెరుగుతున్న ఉద్రేకం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న గణనీయమైన ప్రభావం వల్ల ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో చైనా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండానే జీరో కోవిడ్ పాలసీని ఎత్తేసింది.
కప్‌బోర్డ్‌లో కూతురు మృతదేహం.. మంచం కింద తల్లి శవం.. గుజరాత్ లోని ఆస్పత్రిలో దారుణం..
దీంతో అప్పటి నుంచి చైనాలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా ముప్పు అధికంగా ఉండే వృద్ధుల మరణాల రేటు పెరిగింది. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా.. వైరస్ కారణంగా శ్వాసకోశ వైఫల్యంతో నేరుగా మరణించిన వారిని మాత్రమే ఇప్పుడు కోవిడ్ మరణ గణాంకాల క్రింద లెక్కించనున్నట్టు చైనా అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కొత్త ప్రమాణాల వల్ల కరోనా వైరస్ సోకి దాని వల్ల ఇతర అనారోగ్యాలకు గురై చనిపోయిన వారి మరణాలు లెక్కలోకి రావు. ఈ కొత్త ప్రమాణాల ప్రకారం మంగళవారం కోవిడ్ -19 తో ఒక్కరు కూడా మరణించలేదని చైనా బుధవారం ప్రకటించింది.