'డిసెంబర్ 2023 నాటికి  మసీదు నిర్మాణాన్ని పూర్తి  చేస్తాం'

Published : Nov 13, 2022, 02:09 PM IST
'డిసెంబర్ 2023 నాటికి  మసీదు నిర్మాణాన్ని పూర్తి  చేస్తాం'

సారాంశం

రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో అయోధ్యలో నిర్మిస్తున్న మసీదు నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది.

అయోధ్య మసీదు నిర్మాణం: సుప్రీంకోర్టు ఆదేశాలతో అయోధ్యలో నిర్మిస్తున్న మసీదు డిసెంబర్ 2023 నాటికి పూర్తి కానుంది. ఈ విషయాన్ని  ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలకు లోబడి ఈ మసీదు నిర్మించే భూమిని ముస్లిం పక్షానికి అప్పగించారు. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు నిర్మాణం కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. 

ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి అథర్ హుస్సేన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..'ఈ నెలాఖరులోగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుండి మసీదు, ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ , పరిశోధనా కేంద్రం యొక్క మ్యాప్‌ ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాము. ఆ తర్వాత వెంటనే మసీదు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. మసీదుతో పాటు ఇతర నిర్మాణాలను త్వరలో పూర్తి చేశాం. దీని నిర్మాణానికి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించనప్పటికీ, వచ్చే ఏడాది డిసెంబర్(2023) నాటికి మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 

ఐదెకరాల మౌల్వీ అహ్మదుల్లా షా కాంప్లెక్స్‌లో మిగిలిన నిర్మాణాలు ఆ తర్వత నిర్మిస్తాం తెలిపారు. ట్రస్టు గతంలో జారీ చేసిన డిజైన్‌లోనే మసీదు. ఇతర సౌకర్యాలు నిర్మిస్తామని హుస్సేన్‌ తెలిపారు. మసీదు పేరు 'ధన్నిపూర్ అయోధ్య మసీదు' కాగా మసీదు మొత్తం సముదాయం మరియు ఇతర సౌకర్యాలన్నింటినీ 'మౌల్వీ అహ్మదుల్లా షా కాంప్లెక్స్' అని పిలుస్తారు. అహ్మదుల్లా షా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అని ఆయన అన్నారు.

ఆలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈలోగా మసీదు నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో (అక్టోబర్ 25న) మాట్లాడుతూ ..2023 డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, 2024 జనవరిలో మకర సంక్రాంతి తర్వాత ఆలయంలో విధిగా దర్శనం ప్రారంభిస్తామని చెప్పారు.

సుప్రీం కోర్టు ఆదేశం ఏమిటి

సుదీర్ఘకాలంగా నలుగుతున్న అయోధ్య కేసులో సుప్రీం కోర్టు (నవంబర్ 9, 2019న) తీర్పును వెలువరింది. వివాదాస్పద స్థలంలో 2.77 ఎకరాలను హిందూ పక్షాన ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు అయోధ్యలోనే ప్రముఖ ప్రదేశంలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని ముస్లింలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా, అయోధ్య జిల్లా యంత్రాంగం అయోధ్యలోని సోహవాల్ తహసీల్‌లోని ధన్నీపూర్ గ్రామంలోని భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం బోర్డు ఏర్పాటు చేసిన ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ స్థలంలో మసీదుతో పాటు ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్ లైబ్రరీ మరియు పరిశోధనా సంస్థను నిర్మించాలని నిర్ణయించింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !