త్వరలో కాంగ్రెస్ అంతమవుతుంది: కర్ణాటక సీఎం  

By Rajesh KarampooriFirst Published Dec 8, 2022, 1:17 PM IST
Highlights

కర్ణాటకలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీ జనసంకల్ప యాత్ర చేపడుతోంది. ఇదిలావుండగా.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారం (డిసెంబర్ 7) ఎన్నికలకు అసెంబ్లీ స్థానానికి బహుళ పోటీదారుల గురించి సూచనప్రాయంగా చెప్పారు. త్వరలో బీజేపీ కనుమరుగవుతోందని అన్నారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా కనుమరుగవుతోందని కర్ణాటక  రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై జోస్యం చెప్పారు. తుమకూరు జిల్లా కుణిగల్‌లో బుధవారం జనసంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో  అత్యధిక కాలం కాంగ్రెస్‌ పాలన సాగిందని, అయితే ప్రజలను మోసం చేయడం మినహా ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం అన్నారు.

అధికారంలో తిరిగి రావాలని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..  దేశంలో బీజేపీ ఓ  శక్తిగా అవతరించిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్థానం కోల్పోయిందని అన్నారు. ఇదే పరిస్తితి ఇలానే ఉంటే.. త్వరలో బీజేపీ కనుమరుగవుతోందని అన్నారు. కుల ప్రాతిపదికన ఓట్లు అడగడం, మతాలను విభజించడం, సృష్టించడం వంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతుందని సీఎం అన్నారు.

కాంగ్రెస్ నేతలు.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి ప్రసంగాల్లో మాట్లాడుతున్నారు. వారికి రక్షణ ఉండదనే అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారనీ విమర్శించారు. వెనుకబడిన తరగతుల ప్రజలు వెనుకబడి ఉన్నారనీ, ఇప్పుడు ఆ వర్గాలన్నీ మేల్కొని ప్రశ్నించే సమయం వచ్చిందని  అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి అభ్యున్నతికి వెచ్చించిన మొత్తం చూస్తుంటే.. ఆ వర్గాల జీవితాలు ఎప్పుడో బాగుపడేవనీ, కానీ.. వారు ఇప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రగతి సాధించలేకపోతున్నారని విమర్శించారు. 

సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, వేలకోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారని అన్నారు. బిజెపి తన ఐదేండ్ల పాలనలో 7 లక్షల హెక్టార్ల భూమికి నీరందించేందుకు రూ.32,000 కోట్లు వెచ్చించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ.54,000 కోట్లు వెచ్చించి కేవలం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని సీఎం అన్నారు. "ఆ డబ్బు ఎక్కడికి పోయింది.. ఆ డబ్బు ఎవరి జేబులోకి పోయింది?" అని అడిగాడు బొమ్మై.

'కాంగ్రెస్‌ అవినీతి గంగోత్రి'

కాంగ్రెస్‌ను 'అవినీతి గంగోత్రి'గా అభివర్ణించిన సీఎం బొమ్మై.. కాంగ్రెస్ మంత్రివర్గ సహచరులపై 50కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నందున అవినీతి నిరోధక బ్యూరోను ప్రారంభించేందుకు లోకాయుక్త సంస్థను మూసివేశారన్నారు. ‘ఎన్నో కేసులకు ఆధారాలు ఉన్నా అన్ని కేసులపై ఏసీబీ ‘బీ’ రిపోర్టు దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతికి లోకాయుక్త మూసివేత ఉత్తమ ఉదాహరణ.. కాంగ్రెస్ మంత్రులు ఐదేళ్లుగా ఎన్నో ప్రభుత్వ శాఖలను దోచుకున్నారు. 'అన్న భాగ్య' పథకం కింద పేదలకు పంపిణీ చేసిన బియ్యాన్ని కూడా దోచుకున్నారు" అని ఆరోపించారు. 

కర్నాటకలో బీజేపీకి అనుకూల తరంగాలు

రాష్ట్రమంతటా బీజేపీకి అనుకూల తరంగాలున్నాయనీ, హైదరాబాద్-కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక, ముంబై-కర్ణాటక ప్రాంతాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుణిగల్, తుమకూరు రూరల్, కొరటగెరె, మధుగిరిలలో బీజేపీ స్వల్ప తేడాతో ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. 

click me!