ఆ విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ .. అసలేం జరిగింది ?

By Rajesh KarampooriFirst Published Nov 21, 2022, 3:30 PM IST
Highlights

రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కేసులో కాంగ్రెస్ రివ్యూ పిటిషన్ వేయనుంది. ఈ హత్యలో ప్రమేయమున్న ఆరుగురు మహిళా దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు దానిని సవాలు చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో పేర్కొన్న కారణాలను సవాల్ చేస్తూ ఈ వారంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది.

రాజీవ్ గాంధీ హత్య: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల విడుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. దీనిపై కాంగ్రెస్‌ త్వరలో రివ్యూ పిటిషన్‌ వేయనుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తాజాగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషుల విడుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి.

ఈ వారంలో పిటిషన్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..  త్వరలో పార్టీ తరపున తాజా సమీక్షా దరఖాస్తును దాఖలు చేయనున్నామని పార్టీ వర్గాలు తెలిపారు. ఈ కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నది. 

నవంబర్ 11న వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు 

రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు నిందితులను విడుదల చేయాలని నవంబర్ 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరస్తులకు శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నళిని శ్రీహరన్‌తో పాటు ఆర్పీ రవిచంద్రన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్‌లు కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మేలో ఆర్టికల్ 142ను పేర్కొంటూ మరో దోషి ఏజీ పెరారివాలన్‌ను సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

21 మే 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుంది. ఇందులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతి చెందారు. ఈ కేసులో పెరారివాలన్, మురుగన్, సంతన్, రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, నళిని శ్రీహరన్‌లతో సహా పలువురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

click me!