కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు కరోనా: ఆసుపత్రిలో చేరిక

By narsimha lode  |  First Published Aug 25, 2020, 1:59 PM IST

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు మంగళవారంనాడు కరోనా సోకింది.బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మాజీ మంత్రి డీకే శివకుమార్ చేరాడు.
 



బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు మంగళవారంనాడు కరోనా సోకింది.బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మాజీ మంత్రి డీకే శివకుమార్ చేరాడు.

భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో డీకే శివకుమార్ విస్తృతంగా పర్యటించారు. మరో వైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 

Latest Videos

undefined

ఇంతకుముందే కర్ణాటక సీఎం బీఎస్ యుడియూరప్పతో పాటు ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యకు కూడ కరోనా సోకింది. కరోనా నుండి కోలుకోవడంతో వీరిద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా శివకుమార్ కు కరోనా సోకింది. తనను కలిసిన వారంతా కూడ పరీక్షలు నిర్వహించుకోవాలని  ఆయన కోరాడు. అదే విధంగా క్వారంటైన్ లో ఉండాలని శివకుమార్ సూచించారు.

రాష్ట్రంలోని ఐదుగురు మంత్రులకు కూడ కరోనా సోకింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 31,67,323లకు చేరుకొన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 60,975 కరోనా కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 197,625 మంది కోలుకొన్నారు. మరో వైపు రాష్ట్రంలో ఇప్పటికి 81,320  యాక్టివ్ కేసులున్నాయి. 

click me!