Assembly Election 2022: రాజ్ బబ్బర్ ట్వీట్లు వెనుక అంత‌ర్యమ‌దేనా ? ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై?

By Rajesh KFirst Published Jan 28, 2022, 3:15 PM IST
Highlights

Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది.. ఈ క్ర‌మంలో రాజ్ బబ్బర్ ట్వీట్లు కూడా  కాంగ్రెస్‌ను వీడుతారనే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేరుకుతోంది. 

Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న క్ర‌మంలో పార్టీ ఫిరాయింపుల రాజకీయం హీటెక్కుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి (Congrss)మరో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం కాంగ్రెస్ నాయకుడు, యూపీ మాజీ ఎమ్మెల్యే రాకేష్ సచన్(Rakesh Sachan) బీజేపీలో చేరారు.  
 
తాజాగా మ‌రో నేత కూడా పార్టీని వీడినున్న‌ట్టు స‌మాచారం. అత‌డే..  బాలీవుడ్ స్టార్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమాజ్‌వాదీ పార్టీ వైపు చూస్తున్నారని, ఇప్పటికే ప‌లుమార్లు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో చ‌ర్చిన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో రాజ్ బబ్బర్ ట్వీట్లు కూడా  కాంగ్రెస్‌ను వీడుతారనే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేరుకుతున్నాయి. 

తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే.. జైరాం రమేష్ వంటి ఇతర పార్టీల నాయకుల  తీవ్రంగా వ్య‌తిరేకించ‌గా, మ‌రికొంద‌రు నేత‌లు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. రాజ్ బబ్బర్ మాత్రం ఆజాద్‌కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడాన్ని స్వాగతించారు. "అభినందనలు గులాం నబీ ఆజాద్ సాహబ్! మీరు అన్నయ్య లాంటి వారు  మీ నిష్కళంకమైన ప్రజా జీవితం, గాంధేయ ఆశయాల పట్ల మీ నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయ‌కం. ఈ పద్మభూషణ్.. మీ ఐదు దశాబ్దాల దేశానికి మీరు చేసిన నిశిత సేవకు ఆదర్శప్రాయమైన గుర్తింపు" అని ట్వీట్ చేశారు. 

గులాం నబీ ఆజాద్‌ను అభినందించడంతో రాజ్ బబ్బర్‌పై కొందరు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై త‌న‌దైన శైలిలో ఘాటుగా బ‌దిలించారు. "ప్రతిపక్ష పార్టీ నాయకుడి విజయాలను గౌరవించినప్పుడు అవార్డు మరింత అర్థవంతంగా మారుతుంది. ఎవరైనా తమ సొంత పార్టీ నాయకుల కోసం ఇవ్వ‌గ‌ల‌రు. కానీ ప్ర‌తిప‌క్ష నేత‌కు ఇవ్వ‌డంలోనే నిజ‌మైన గుర్తింపు పద్మభూషణ్‌పై వివాదం అనవసరం అని నేను భావిస్తున్నాను" అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఇలా ఘాటుగా స్పందించ‌డంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి..సమాజ్‌వాదీ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊతమిచ్చిన‌ట్టు అయ్యింది. 

రాజ్ బ‌బ్బ‌ర్ రాజ‌కీయ ప్ర‌స్థానం:
 
సినీరంగంలో మంచి పేరు సంపాదించుకున్న రాజ్ బబ్బర్ 1980వ దశకంలో జనతాదళ్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి, 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆగ్రా నుంచి గెలిచారు. కానీ కొన్ని కార‌ణాల‌తో 2006లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009లో, మిస్టర్ బబ్బర్ ఫిరోజాబాద్ నుండి ఉప ఎన్నికలో గెలుపొందారు. 
  2014, 2019 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్‌గా ఉన్నారు. 

 ఇప్ప‌టికే యూపీ కాంగ్రెస్ నుంచి ప‌లువురు సినియ‌ర్ నేత‌లు పార్టీ వీడిపోయారు. పార్టీ క్షీణత 2020లో నుండే ప్రారంభ‌మైంది. తొలుత 2020లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి బిజెపిలో చేరాడు.గత ఏడాది, జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త వారం సినీయ‌ర్ నేత RPN సింగ్ వెళ్లిపోయాడు. దీంతో యూపీ కాంగ్రెస్ నానా తంటాలు ప‌డుతోంది. ప్ర‌స్తుతం రాజ్ బ‌బార్ కూడా వెళ్లిపోతే క‌ష్టంలో ప‌డిన‌ట్టే.  

click me!