కాంగ్రెస్ కి షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత

Published : Mar 04, 2019, 02:00 PM IST
కాంగ్రెస్ కి షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత

సారాంశం

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో మరో షాక్ తగిలింది.  

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో మరో షాక్ తగిలింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్.. సోమవారం పార్టీకి రాజీనామా చేశారు.  అనంతరం తన రాజీనామా లేఖను కర్ణాటక శాసనసభ స్పీకర్ కి అందజేశారు.

కాగా.. అతను త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న కర్ణాటక పర్యటనకు వస్తున్నారని.. ఆ సందర్భంగా ఉమేష్‌ బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీన బీజేపీ నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. మల్లికార్జున్‌ ఖర్గేకు జాదవ్‌ మద్దతివ్వరని తెలిపారు. 

అధికారం కోసం బీజేపీలోకి జాదవ్‌ రావడం లేదని షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి కోసం వస్తున్నారని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమేష్‌ జాదవ్‌.. కాలాబురాగి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చించోలి నియోజకవర్గం నుంచి జాదవ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వృత్తిరీత్యా డాక్టరైన జాదవ్‌.. రాజకీయ రంగ ప్రవేశం కంటే ముందు కాలాబురాగి ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేశారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu