త్రిపురలో కాంగ్రెస్ ముందజ.. నకిలీ పోస్టు షేర్ చేసిన అస్సాం కాంగ్రెస్ చీఫ్..

Published : Feb 27, 2023, 01:11 PM ISTUpdated : Feb 27, 2023, 02:17 PM IST
త్రిపురలో కాంగ్రెస్ ముందజ.. నకిలీ పోస్టు షేర్ చేసిన అస్సాం కాంగ్రెస్ చీఫ్..

సారాంశం

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవైపు పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేలా అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవైపు పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. బీబీసీ పేరుతో ఉన్న నకిలీ పోస్టును షేర్ చేశారు. ఆ నకిలీ సర్వేలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన త్రిపురలో ఓపియన్స్ పోల్స్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. అలాగే త్రిపురలో సీపీఐఎం, కాంగ్రెస్‌లు కలిసి 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా చెప్పారు. 

అయితే ఓ వైపు మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. భూపేన్ కుమార్ చేసిన నకిలీ పోస్టుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్రిపురలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న ఓటింగ్ జరిగింది. మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగింది.

 


ఇక, త్రిపుర అసెంబ్లీ  ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మార్చి 2వ తేదీన లెక్కించనున్నారు. మరోవైపు మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత.. మూడు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓపినియన్ పోల్స్ వెలువడనున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !