Smriti Irani Row: చ‌నిపోయిన వ్య‌క్తిపై బార్ లైసెన్స్.. స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ 

Published : Jul 23, 2022, 04:01 PM ISTUpdated : Jul 23, 2022, 04:10 PM IST
Smriti Irani Row: చ‌నిపోయిన వ్య‌క్తిపై బార్ లైసెన్స్.. స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ 

సారాంశం

Smriti Irani Row: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ.. గోవాలో నిర్వ‌హిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ కు మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్ పొందార‌నే వ్యవహారం రాజ‌కీయంగా సంచలనంగా మారింది.  

Smriti Irani Row: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో న‌డుపుతున్న రెస్టారెంట్ కు మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్ పొందార‌నే వ్యవహారం రాజ‌కీయంగా సంచలనంగా మారింది. జోయిష్ ఇరానీ.. గోవాలోని అస్సాగోలో ‘సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్’ (Silly Souls Cafe and Bar)అనే  రెస్టారెంట్ నిర్వహిస్తోంది. అయితే.. ఆ రెస్టారెంట్ లైసెన్స్ లు మరణించిన వ్యక్తి పేరును ఉపయోగించి లైసెన్స్ పునరుద్ధరించినట్లు వెలుగుచూడటంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.  

స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ మోస‌పూరిత ప‌ద్ద‌తిలో మద్యం లైసెన్స్ లు పొందార‌ని గోవా ఎక్సైజ్ శాఖ కమిషనర్ రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ విష‌యంలో స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్మృతి ఇరానీ త‌న మంత్రి ప‌ద‌వీకి  రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసింది. నకిలీ లైసెన్స్ తో గోవాలో స్మృతి ఇరానీ కుమార్తె బార్ అండ్ రెస్టారెంట్ న‌డిపిస్తుందని, అస‌లు ఆమె కూతురు ఏ ప‌ద్ద‌తిలో లైసెన్స్ పొందార‌ని ప్ర‌శ్నించింది.  

రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్‌

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆర్టీఐ ప‌త్రాల‌ను చూపిస్తూ.. ఇవి ఇరానీపై చేస్తున్న ఆరోపణలు కావనీ, ఆర్టీఐ నుంచి తీసుకున్న పత్రాలని వివ‌రించారు. స్మృతి ఇరానీ కుమార్తె నకిలీ లైసెన్స్ తో  గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తుంద‌ని విమ‌ర్శలు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్ తీసుకున్నారనీ, గోవా చట్టం ప్రకారం ఎవ్వ‌రైనా రెస్టారెంట్ లైసెన్స్ పొందవచ్చని తెలిపారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోసం:  కాంగ్రెస్

మోసపూరిత మార్గాల్లో మద్యం లైసెన్స్ పొందార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో గోవా ఎక్సైజ్ శాఖ అప్ర‌మ‌త్తమైంది. ఆ శాఖ‌కు చెందిన కమిషనర్ రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రెస్టారెంట్‌కు నోటీసు ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ బదిలీకి సన్నాహాలు చేశారని, ఈ విష‌యంలో స్మృతి ఇరానీ నుండి సమాధానం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇరానీ అనుమతి లేకుండా ఈ వ్య‌వ‌హ‌రం జరుగుతుందా? ఈ విష‌యం అధికారాన్ని పెట్టుకుని మోసాన్ని దాచిపెడుతున్నార‌నీ, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని జైరాం రమేష్ అన్నారు. అదే సమయంలో మహిళా ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
 
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ రెస్టారెంట్‌కు గోవా ఎక్సైజ్ కమిషనర్ నారాయణ్ ఎమ్ గాడ్ జులై 21వతేదీన షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హ‌రంపై జులై 29న కోర్టులో విచారణ జరగనుందని పేర్కొన్నారు. గోవా ఎక్సైజ్ కమిషనర్ షోకాజ్ నోటీసు ప్రకారం..జోయిష్ ఇరానీ నిర్వ‌హిస్తున్న‌ రెస్టారెంట్‌కు ఆంథోనీ‌ద్గామా  అనే వ్య‌క్తి పేరు మీద‌  లైసెన్స్ ఉంది. అయితే ఆ వ్య‌క్తి గత ఏడాది మే 17 మరణించారు. అయినా.. గ‌త‌నెల‌లో ఆ చ‌నిపోయిన వ్య‌క్తి పేరు మీద‌నే మద్యం లైసెన్స్ పునరుద్ధరించారని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌