కాంగ్రెస్‌లో అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలి: ఆజాద్ డిమాండ్

By narsimha lode  |  First Published Aug 28, 2020, 11:56 AM IST

పార్టీలోని అన్ని రకాల పదవులకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 
శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి పార్టీ నాయకత్వంపై  విమర్శలు గుప్పించారు.


న్యూఢిల్లీ: పార్టీలోని అన్ని రకాల పదవులకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 
శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి పార్టీ నాయకత్వంపై  విమర్శలు గుప్పించారు.

సీడబ్ల్యుసీతో పాటు పీసీసీ అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రకంగా ఎన్నికలు నిర్వహించకపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

ఢిల్లీకి వచ్చినవారికే పీసీసీ చీఫ్ పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నేతలకు పార్టీలో ఒక్క శాతం మద్దతు కూడ లేదని ఆయన తేల్చి చెప్పారు. 

తమ పదవులు పోతాయనే ఉద్దేశ్యంతోనే ఎవరూ కూడ దీనిని వ్యతిరేకించడం లేదన్నారు. పార్టీ బలోపేతం కావాలని కోరుకొనే వారంతా తమ ప్రతిపాదనను స్వాగతిస్తారని ఆయన చెప్పారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీని ఈ తరహలోనే ఎన్నుకోవాలని ఆయన కోరారు.

పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు 51 శాతం మంది మీతో ఉంటారు. మీకు వ్యతిరేకంగా 2 నుండి 3 మంది వ్యతిరేకంగా ఉంటారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో 23 మంది కాంగ్రెస్ సీనియర్లు రాసిన లేఖ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ లేఖతో మనస్థాపానికి గురైన సోనియాగాంధీ పార్టీ పదవి నుండి తప్పుకొంటానని ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకోవాలని కోరారు. అయితే పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొంది. మరో ఆరు మాసాల పాటు  సోనియాగాంధీ ఈ పదవిలో కొనసాగనున్నారు.

click me!