చపాతీ బాగా చేస్తావా? అత్త ప్రశ్న... పగిలిన కోడలి కర్ణభేరి.. చివరికి..

Published : Jun 02, 2022, 12:01 PM ISTUpdated : Jun 02, 2022, 12:31 PM IST
చపాతీ బాగా చేస్తావా? అత్త ప్రశ్న... పగిలిన కోడలి కర్ణభేరి.. చివరికి..

సారాంశం

చపాతీ బాగా చేస్తావా? అని అడిగిన ప్రశ్న అత్తాకోడళ్ల మధ్య గొడవకు దారి తీసింది. చివరికి కోడలి చెవి పగిలి, పోలీస్ కేసు అవ్వడానికి దారి తీసింది. 

మహారాష్ట్ర : చపాతీ బాగా చేస్తావా నువ్వు?.. అని ఓ mother in law కోడలిని అడిగింది. దీనికి సుర్రుమన్న కోడలు కాస్త వెటకారం జోడించి వ్యగ్యంగా సమాధానం ఇచ్చింది. అంతే అత్తకు కాలింది. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై గొడవకు దారి తీసింది. చివరికి కోడలి గూబ గుయ్యిమన్నది. కర్ణభేరి పగిలి ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

maharashtraలోని బద్లాపుర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ భవనంలో అశ్విన్ నికుంభ్ (32) కుటుంబం ఉంటోంది. సోమవారం రాత్రి అతడి భార్య కోమల్ (22) వంటగదిలో భోజనం సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అత్తగారు.. (భర్త అశ్విన్ తల్లి) చపాతీ బాగా చేస్తావా? అంటూ కోడలిని ప్రశ్నించింది. అది కాస్త వెటకారంగా కోడలికి వినిపించింది. వెంటనే ఆమె.. ‘అవును.. మా అత్తగారిని దృష్టిలో పెట్టుకుని మంచిగానే తయారు చేస్తాను’ అంటూ వ్యగ్యంగా చెప్పింది. ఆ సమాధానంతో అత్తగారికి, కోడలికి గొడవ మొదలయ్యింది. 

ఆ గొడవ కాసేపటికి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మాటలయుద్ధం చివరికి చేతల దాకా వచ్చింది. ఈ గొడవ అంతా చూస్తున్న అశ్విన్.. ఎంతసేపటికీ ఇద్దరూ ఊరుకోకపోవడంతో.. కోపానికి వచ్చి కోమల్ ఎడమ చెవి మీద రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కర్ణభేరి పగిలింది. అశ్విన్ అంతటితో ఊరుకోలేదు.. కోమల్ ను బెల్టుతో చావగొట్టాడు. అశ్విన్ నుంచి తప్పించుకున్న ఆమె పోలీస్ స్టేషన్ కు చేరుకుని భర్త మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో extramartial affairకి అడ్డంగా ఉందని ఆగ్రహంతో ఓ మహిళను.. ముగ్గురు వ్యక్తులు కలిసి murder చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగళవారం ఈ విషయం మీడియాకు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  సామర్లకోట మండలంలోని జి మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం మార్చి 19 నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆమె భర్త మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై టి సునీత missing కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కృష్ణ, మాణిక్యం దంపతుల కుమారుడు గతంలో మరణించాడు. అతడి భార్య.. అత్త వారి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన వందే వెంకన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటోందని అక్కసుతో మాణిక్యాన్ని ఆమె కోడలు, వెంకన్నలు హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. ఆమెను చంపేసిన తరువాత  ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి గోదావరి కాలువలో పడేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం