కాఫీడే కొత్త సీఈవో ఎవరో తెలుసా..?

By telugu news teamFirst Published Dec 8, 2020, 9:16 AM IST
Highlights

సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధార్థ గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణానంతరం ఇండిపెండెంట్ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్ మధ్యంతర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
 

కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజే సిద్ధార్థ గతేడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆయన చనిపోయి దాదాపు సంవత్సరం పూర్తయ్యింది. ఏడాది తర్వాత కాఫీ డే కి కొత్త సీఈవో నియమితులయ్యారు. 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ కుమార్తె, కాఫీడే వ్యవస్థాపకుడు అయిన సిద్ధార్థ భార్య మాళివిక హెగ్డే నూతన సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధార్థ గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణానంతరం ఇండిపెండెంట్ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్ మధ్యంతర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా, ఇప్పుడు పూర్తిస్థాయి సీఈవోగా మాళివిక నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన కాఫీడేను తిరిగి నిలబెడతానని చెప్పారు. కాగా, మాళవికతోపాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర నియమితులయ్యారు.  2025 వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు. బెగళూరుకు చెందిన కేఫ్ డే దేశ వ్యాప్తంగా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది.

click me!