భాగవతం కథలు విన్న సీఎం యోగి ఆదిత్యనాథ్

By Arun Kumar P  |  First Published Nov 8, 2024, 9:33 PM IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భాగవతం కథలు విన్నారు. జగద్గురు స్వామి రాఘవాచార్య జీ మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు.  


ప్రతాప్‌గఢ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతాప్‌గఢ్‌లోని కర్మాహి గ్రామంలో జరిగిన శ్రీమద్ భాగవత కథా పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ జలశక్తి మంత్రి మహేంద్ర సింగ్ ఇంట్లో జరుగుతున్న అ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి కొద్దిసేపు భాగవత కథలు విన్నారు. ఈ సందర్భంగా కథా వ్యాఖ్యాత జగద్గురు స్వామి శ్రీ రాఘవాచార్య జీ మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఆయనకు శాలువా, మాలతో సత్కరించారు. మహేంద్ర సింగ్ పూర్వీకులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీమద్ భాగవత మహాపురాణం మోక్ష గ్రంథమని, ముక్తి మార్గం చూపుతుందని సీఎం యోగి అన్నారు.

 

Latest Videos

శ్రీమద్ భాగవత మహాపురాణం వినే అవకాశం పుణ్యం, అదృష్టమని సీఎం అన్నారు. స్వామిజీ విద్వత్తు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో విజయం సాధించడమే వారి ముక్తి మార్గం అవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్ర సింగ్ సీఎంకు శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేసి ఆశీర్వాదం పొందారు. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా కూడా కథావ్యాఖ్యాత, సీఎంకు శాలువా కప్పి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్ మౌర్య, జిత్ లాల్ పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆశిష్ శ్రీవాస్తవ్, మాజీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ ఎమ్మెల్యే ధీరజ్ ఓజా, బీజేపీ నాయకులు, ప్రయాగ్‌రాజ్ మండలం ఏడీజీ భాను భాస్కర్, ఐజీ ప్రేమ్ కుమార్ గౌతమ్, కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, కలెక్టర్ సంజీవ్ రంజన్, ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్, సీడీవో డాక్టర్ దివ్య మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

click me!