‘శ్యామల’గా సిమ్లా.. అబ్బే అదేం లేదంటున్న సీఎం

By sivanagaprasad kodatiFirst Published Oct 23, 2018, 2:19 PM IST
Highlights

దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును ‘‘శ్యామల’’గా మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ స్పందించారు. 

దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును ‘‘శ్యామల’’గా మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ స్పందించారు. సిమ్లా పేరు మార్పుపై ప్రతిపాదన వచ్చిన సంగతి నిజమేనన్నారు.

అయితే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. వచ్చిన అన్ని ప్రతిపాదనలను ఆమోదించాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు. సిమ్లా పేరు మార్పు విషయంలో ఆరోగ్యమంత్రి విపిన్ సింగ్‌ పర్మార్‌తో కూడా వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

సిమ్లా పేరును మార్చాలంటూ జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్రప్రభుత్వానికి వీహెచ్‌పీ ప్రతిపాదన కూడా అందజేసిందని పర్మార్ అన్నారు. ఈ వార్తల నేపథ్యంలో చరిత్రకారుడు రాజా బాసిన్ మాట్లాడుతూ.. సిమ్లా పేరును సిమ్లా లేదా షిమ్లాగానే పలకాలి.. ఏ ఒక్కరూ కూడా దానిని తప్పుగా పలకడం గానీ.. అపార్థం చేసుకోవడానికి గానీ వీల్లేదని.. పేరు మార్చడంలో ఎలాంటి అర్థం లేదన్నారు.. 
 

click me!