నన్ను సీఎం చేసి ఉంటే సక్సెస్ ఏంటో చూపెట్టేవాడ్ని.. ఈ సీఎం కాంగ్రెస్‌ను ముంచుతాడు.. వీడియోకు చిక్కిన సిద్దూ

By telugu teamFirst Published Oct 8, 2021, 8:20 PM IST
Highlights

పంజాబ్ కాంగ్రెస్‌లో ముసలం ముగిసిపోలేదు. మొన్నటి దాకా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను టార్గెట్ చేసిన సిద్దూ ఇప్పుడు తాజా సీఎం చన్నీపై ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీఎం కాంగ్రెస్‌ను ముంచుతాడని అన్నారు. తనను సీఎం చేసి ఉంటే సక్సెస్ అంటే ఏంటో చూపెట్టేవాడిని అని పార్టీ నేతలతో ఆయన గుసగుసలాడుతూ ఓ వీడియోకు చిక్కారు.
 

చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో అసంతృప్తి ఇంకా సమసిపోలేదని తెలుస్తున్నది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, సిద్దూ కూడా రాజీనామా చేయడం వంటి షాకింగ్ ఎపిసోడ్‌లు congressను కుదిపేశాయి. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌ను, సిద్దూను సమాన దూరంలో పెట్టి చరణ్‌జిత్ సింగ్ channiని సీఎం చేసింది. కెప్టెన్ పార్టీని వీడారు. క్యాబినెట్ సర్దుబాటులపై అసంతృప్తితో సిద్దూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ కావడం, తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సిద్దూ సంకేతాలనిచ్చారు. అయినప్పటికీ పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు ఇంకా ముదిరిపోతున్నాయని, కాంగ్రెస్ ఫార్ములా బెడిసికొట్టేలా ఉన్నదని ఓ వీడియో వెల్లడిస్తున్నది.

లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా punjab కాంగ్రెస్ మొహలీలో నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి సిద్దూ సహా ఇతర పార్టీ నేతలు, మంత్రులు హాజరయ్యారు. కానీ, సీఎం చన్నీ ఆలస్యంగా వచ్చారు. ఈ సమయంలోనే navjot singh sidhuపైనే ఫోకస్ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వీడియోలో సీఎం చన్నీపై సిద్దూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం చన్నీపై సిద్దూ వాకబు చేయగా పార్టీ నేత పర్గత్ సింగ్ సమీపానికి వచ్చారని, ఏ క్షణంలోనైనా ఇక్కడకు చేరుకోవచ్చని సమాధానమిచ్చారు. ఇంతమందిమి ఆయన కోసం ఎదురుచూస్తున్నామని సిద్దూ అన్నారు. ఈ సమాధానం విన్న పర్గత్ సింగ్ సిద్దూ దృష్టిని మందిపైకి మరలించాడు. మనం చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ఇదేం సక్సెస్.. నన్ను సీఎం చేసి ఉంటే success ఏంటో చూపించేవాడిని అంటూ కామెంట్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో ఈ chief minister చన్నీ కాంగ్రెస్‌ను నిలువునా ముంచేస్తాడు అని అన్నాడు. అస్పష్టంగా ఉన్న ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సిద్దూ గతనెల 28న రాజీనామా చేశాడు. కానీ, తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా ప్రవర్తించాడు. కానీ, రాజీనామాను ఉపసంహరించుకోవడంపై స్పష్టత లేదు.

click me!