Kerala: కన్నూర్ యూనివర్శిటీ (Kannur varsity)వైస్ ఛాన్సలర్‌గా గోపీనాథ్ రవీంద్రన్‌ను తిరిగి నియమించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు (Higher Education Minister R Bindu)పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. వీసీ నియామకంలో కాంగ్రెస్ (congress) నేత రమేష్ చెన్నితాల (Ramesh Chennithala) తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా గోపీనాథ్ రవీంద్రన్‌ను తిరిగి నియమించడంపై కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందుపై కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల లోకాయుక్త (Lokayukta) లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ ఆయన పిటిషన్‌ను లోకాయుక్త శుక్రవారం తోసిపుచ్చింది. మంత్రి ఆర్.బిందు అధికార దుర్వినియోగం చేయలేదనీ, బంధుప్రీతి చూపలేదనీ, గవర్నర్‌పై అనవసర ఒత్తిడి చేయలేదని లోకాయుక్త పేర్కొంది.
కన్నూర్ యూనివర్శిటీ (Kannur varsity) వైస్ ఛాన్సలర్‌గా గోపీనాథ్ రవీంద్రన్‌ను తిరిగి నియమించడం మాత్రమే ప్రతిపాదించారు. అయితే, దీనిని కావాలంటే గవర్నర్ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ విషయంలో మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తెలిపారు. మంత్రిగా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదన్నారు. తప్పుడు మార్గాన్ని తీసుకున్నారా అనేది స్పష్టంగా తెలియదని లోకాయుక్త పేర్కొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల (Ramesh Chennithala) దాఖలు చేసిన పిటిషన్ ను లోకాయుక్త (Lokayukta) తోసిపుచ్చింది.
కాగా, Kannur varsity వైస్ ఛాన్సలర్ నియామకంలో మంత్రి బిందు అక్రమంగా జోక్యం చేసుకున్నారని లోకాయుక్తలో దాఖలైన పిటిషన్‌లో ప్రధానంగా పేర్కొన్నారు. వీసీని మళ్లీ నియమించాలని మంత్రి చేసిన ప్రతిపాదన చట్టవిరుద్ధమని రమేష్ చెన్నితాల తన ఫిర్యాదులో లేవనెత్తారు. అయితే గవర్నర్ అభ్యర్థన మేరకు ఈ ప్రతిపాదన చేసినట్లు విచారణ సందర్భంగా ప్రభుత్వం లోకాయుక్తకు తెలియజేసింది. వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి బుధవారం గవర్నర్ నుంచి వివరణాత్మక నోట్ అందింది. ఏజీ సలహా మేరకే ఈ చర్య తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రతిపాదనలు పంపాయని గవర్నర్ తన వివరణలో పేర్కొన్నారు.
అంతకు ముందు కన్నూరు వర్సిటీలో వీసీ పునర్ నియామకానికి సంబందించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బిందు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే లోకాయుక్తలో పిటిషన్ దాఖలైంది. ఇదిలావుండగా, చెంగన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత కేకే రామచంద్రన్ నాయర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి మృతి చెందిన గన్‌మెన్ కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎండీఆర్‌ఎఫ్) నుంచి నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan)పై దాఖలైన పిటిషన్‌ను కూడా లోకాయుక్త (Lokayukta) విచారించనుంది. నిబంధనలు ఉల్లంఘించి నిధులు కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని సర్కారు.. కేరళ లోకాయుక్త చట్టాన్ని ఆర్డినెన్స్‌తో సవరించాలని ప్రతిపాదించింది. ఈ చర్య ప్రతిపక్షాల నుండి విమర్శలకు దారితీసింది. లోకాయుక్త తీర్పును వినిపించే అవకాశం ఇచ్చిన తర్వాత దానిని ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటి అధికారాలను ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రతిపాదించే ఆర్డినెన్స్‌ను ప్రకటించాల్సిందిగా కేబినెట్ గవర్నర్‌కు సిఫార్సు చేసింది.