ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్

Published : Sep 02, 2019, 03:50 PM IST
ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్

సారాంశం

ప్రేమికుడని నమ్మి వెళ్లిన పాపానికి ఓ యువకుడు ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. 

ప్రేమికుడని నమ్మి వెళ్లిన పాపానికి ఓ యువకుడు ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పుర్బా మెడినీపూర్ జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమెను బాయ్‌ఫ్రెండ్ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడ అప్పటికే వేచివున్న ఫ్రెండ్స్‌తో కలిసి అతను బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి... ఎవరికైనా చెవితే చంపేస్తామని బెదిరించారు.

అయితే తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బోరుమంది బాలిక. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా.. అవమాన భారంతో ఉన్న బాధితురాలు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆమెను కోల్‌కతాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు యువకులను గుర్తించారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. అసలు నిందితుడు, బాలిక ప్రేమికుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !