న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీద సీజే ఎన్వీ రమణ ప్రశంసల జల్లు...(వీడియో)

Published : Oct 04, 2021, 02:31 PM ISTUpdated : Oct 04, 2021, 02:47 PM IST
న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీద సీజే ఎన్వీ రమణ ప్రశంసల జల్లు...(వీడియో)

సారాంశం

పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్, అవుట్ రీచ్ క్యాంపెయిన్ లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘మన న్యాయశాఖ మంత్రి ఎంత డైనమికో మనందరికీ తెలుసు. ప్రజలతో మమేకం అవ్వడానికి, వారి అభిమానాన్ని చూరగొనడానికి అతను ప్రతీ నిమిషం శ్రమిస్తారు. అతని ప్రతీ చర్యలోనూ అది ప్రతిబింబిస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామ సందర్శిన సమయంలో మంత్రి కిరెన్ రిజిజు వారితో కలిసి చేసిన నృత్యాలు అభిమానుల హృదయాలు కొల్లగొట్టాయి. దీనికి గాను శనివారం నాడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మంత్రి రిజిజు మీద ప్రశంసలు కురిపించారు. 

పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్, అవుట్ రీచ్ క్యాంపెయిన్ లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘మన న్యాయశాఖ మంత్రి ఎంత డైనమికో మనందరికీ తెలుసు. ప్రజలతో మమేకం అవ్వడానికి, వారి అభిమానాన్ని చూరగొనడానికి అతను ప్రతీ నిమిషం శ్రమిస్తారు. అతని ప్రతీ చర్యలోనూ అది ప్రతిబింబిస్తుంది. అలాంటిదే ఇటీవల ఆయన హై ఎనర్జీ డ్యాన్స్‌ వీడియో. అది ట్విటర్ లో వైరల్ గా మారిందని నాకు తెలిసింది. సామాన్య ప్రజలతో ఇలాంటి అనుబంధం, సమాజం పట్ల మంత్రినిబద్ధతను నిలుస్తుంది అంటూ సీఐజే మంత్రి మీద ప్రశంసల జల్లు కురిపించారు. 

జాతీయ న్యాయ సేవా సంస్థ జాతీయ చట్టపరమైన అవగాహన, అవుట్రీచ్ క్యాంపెయిన్ ప్రచారంలో భాగంగా ‘పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్, అవుట్రీచ్  క్యాంపెయిన్’ ప్రారంభ కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 30 న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో రిజుజు టైమ్ లైన్ లో ఉన్న ఓ వీడియో చూసి ఆయన్ని ప్రశంసించారు. 

కిరణ్ రిజిజు డ్యాన్సింగ్ వీడియో చూడండి...

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌