జమ్మూకాశ్మీర్: ఓ పక్క అమిత్ షా పర్యటన.. కాల్పులకు తెగబడ్డ ముష్కరులు, ఓ పౌరుడు మృతి

By Siva Kodati  |  First Published Oct 24, 2021, 9:43 PM IST

షోపియాన్ జిల్లా (shopian district) బాబపూర్‌లో సీఆర్‌పీఎఫ్ 178 బెటాలియన్‌కు (crpf)  చెందిన బృందంపై ఈ ఉదయం ఉగ్రవాదులు (terrorists attack) కాల్పులు తెగబడ్డారు. వెంటనే స్పందించిన సైన్యం (indian army).. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందాడు


బీజేపీ (bjp) అగ్రనేత, కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah)  పర్యటన సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో (jammu kashmir) తుపాకులు గర్జించాయి. షోపియాన్ జిల్లా (shopian district) బాబపూర్‌లో సీఆర్‌పీఎఫ్ 178 బెటాలియన్‌కు (crpf)  చెందిన బృందంపై ఈ ఉదయం ఉగ్రవాదులు (terrorists attack) కాల్పులు తెగబడ్డారు. వెంటనే స్పందించిన సైన్యం (indian army).. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందాడు. మృతుడిని షహిద్ అహ్మద్‌గా పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. కాగా.. కాల్పుల్లో పౌరుడు చనిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడురోజుల పాటు జమ్ము పర్యటనలో ఉన్న కారణంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోయి కాల్పులకు తెగబడటం గమనార్హం. 

అంతకుముందు ఈ రోజు జమ్ములోని డిజియానాలో గురుద్వారాను సందర్శించారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ము కశ్మీర్‌ను 3 కుటుంబాలు భ్రష్టుపట్టించాయని మండిపడ్డారు. ఆ మూడు కుటుంబాలు 70 ఏళ్ల పాటు జమ్ము కశ్మీర్‌కు ఏం ఇచ్చాయని హోంమంత్రి ప్రశ్నించారు. కానీ ఆ 3 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయని, ఆ మూడు కుటుంబాల నుంచి ఆరుగురు ఎంపీలు, 87 మంది ఎమ్మెల్యేలు అయ్యారని అమిత్ షా వివరించారు.

Latest Videos

ALso Read:జమ్ముకశ్మీర్‌లో ఆ 3 కుటుంబాల దందా ఇక బందే: అమిత్ షా వ్యాఖ్యలు

మోడీ (narendra modi) ప్రధాని అయ్యాక జమ్ము కశ్మీర్‌లో గ్రామస్వరాజ్యం తెచ్చారని ఆయన కొనియాడారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో పంచాయతీ పాలన జరుగుతోందని అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో గ్రామ ప్రతినిధులుగా 30 వేల మంది ఎన్నికయ్యారని వివరించారు. ఇకపై ఆ మూడు కుటుంబాల దాదాగిరీ జమ్ము కశ్మీర్ లో పనిచేయదని ఆయన హెచ్చరించారు. 

కాగా.. అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ము కశ్మీర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఆయన జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. అనంతరం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఓ పోలీసు అధికారి  కుటుంబాన్ని పరామర్శించారు. జమ్ము కశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్రహోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
 

click me!