కమల్‌ పోస్టర్లపై పేడ కొట్టాను, రజనీపై విమర్శలు చేస్తే ఊరుకోను: రాఘవ లారెన్స్

Published : Dec 08, 2019, 12:18 PM ISTUpdated : Dec 08, 2019, 01:02 PM IST
కమల్‌ పోస్టర్లపై పేడ కొట్టాను, రజనీపై విమర్శలు చేస్తే ఊరుకోను: రాఘవ లారెన్స్

సారాంశం

సినీ నటుడు రజనీకాంత్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని సినీ డ్యాన్స్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చెప్పారు. 

చెన్నై: సినీ నటుడు రజనీకాంత్‌ పై విమర్శలు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని  సినీ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ చెప్పారు.  రజనీకాంత్ రాజకీయా్లో రావడం వల్ల  రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని  ఆయన అభిప్రాయపడ్డారు. 

శనివారం నాడు రాత్రి చెన్నైలో నిర్వహించిన  ఓ సినిమా ఫంక్షన్  కార్యక్రమంలో  రాఘవ లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజనీ‌కాంత్ రాజకీయాల్లో వస్తున్నాడని కొందరు మాట్లాడడం దురదృష్టకరమని చెప్పారు.

రజనీకాంత్‌కు రాజకీయాలు తెలియవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రజనీని ఎవరూ కూడ టార్గెట్ చేసినా తాను గట్టిగా సమాధానం చెబుతానన్నారు. రజనీకాంత్ రాజకీయం ఏమిటో త్వరలో అందరూ చూస్తారని రాఘవ లారెన్స్ చెప్పారు.  

తనకు చిన్నప్పటి నుండి రజనీకాంత్ అంటే చాలా ఇష్టమన్నారు. చిన్నప్పుడు రజనీకాంత్‌పై అభిమానంతో కమల్‌పోస్టర్ల‌ను పేడతో కొట్టి చింపేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు.  కమల్‌హాసన్, రజనీకాంత్  రాజకీయాల్లో  కలవడం ద్వారా అద్భుతాలు సాధించేవారని చెప్పారు.  రజనీకాంత్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?