అన్ని లెక్కలూ మార్చేశాడు... సరయూ రాయ్‌ని ఫాలో అయిన చిరాగ్

By Siva KodatiFirst Published Nov 12, 2020, 5:33 PM IST
Highlights

బీహార్ ఎన్నికల్లో యువనేత చిరాగ్ పాశ్వాన్ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా జేడీయూకి ఈ ఫలితాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయి. చిరాగ్‌ పాశ్వాన్‌ కారణంగానే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

బీహార్ ఎన్నికల్లో యువనేత చిరాగ్ పాశ్వాన్ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా జేడీయూకి ఈ ఫలితాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయి. చిరాగ్‌ పాశ్వాన్‌ కారణంగానే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్‌ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం.

2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి పోటీ చేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్‌ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని ఆయన ఆరోపించారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ తదుపరి కేబినెట్‌ విస్తరణలో ఈ విషయం స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్‌ పాశ్వాన్‌ పేర్కొన్నారు.

జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం వెలువడిన బీహార్‌ శాసనసభ ఫలితాల్లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి సాధారణ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.

137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోనే ఎల్‌జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని కొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సరయూ రాయ్.. 8550 ఓట్ల తేడాతో రఘుబర్ దాస్‌ను ఓడించారు. 2014లో రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో.. రఘుబర్ దాస్ కాబినెట్‌ నుంచి వైదొగిలిన రాయ్.. బీజేపీకి రాజీనామా చేశారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సీఎంనే మట్టికరిపించారు. 
 

click me!