43 యాప్‌లపై నిషేధం: భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా

By Siva KodatiFirst Published Nov 25, 2020, 2:27 PM IST
Highlights

డ్రాగన్ మరోసారి భారతదేశంపై అక్కసు వెళ్లగక్కింది. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో మనదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. 

చైనా నేపథ్యం ఉన్న యాప్ లను నిషేదించటానికి భారత ప్రభుత్వం 'జాతీయ భద్రత' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది.

భారతదేశంలో అన్ని మార్కెట్ ఆటగాళ్లకు న్యాయమైన, నిష్పాక్షికమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని జి రోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా మే నెలలో లడఖ్‌ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం నిన్న 43 మొబైల్‌ యాప్‌లపై కొరడా ఝుళిపించింది.

తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లూ ఉన్నాయి. 

click me!