Vaccination for Children: ఇక వారు కూడా వ్యాక్సినేషన్ కు అర్హులే..

By Rajesh K  |  First Published Jan 28, 2022, 11:07 AM IST

Vaccination for Children: క‌రోనా​ వ్యాక్సినేషన్​కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 2023 నాటికి 15 ఏళ్లు నిండిన వారు 15-18 ఏళ్లలోపు వ్యాక్సిన్‌కు అర్హులని  ప్ర‌భుత్వం పేర్కొంది.
 


Vaccination for Children: దేశంలో కరోనా విజృంభన‌తో ప్ర‌భుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India). దీనితో ఇప్పటివరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే.. 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారని తెలిపింది.

ఈ త‌రుణంలో.. చిన్న పిల్లల టీకా పంపిణీకి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. జనవరి 2023 నాటికి 15 ఏళ్లు నిండిన వారు 15-18 ఏళ్లలోపు వ్యాక్సిన్‌కు అర్హులని  ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేరకు అదనపు కార్యదర్శి  మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలకు విడుదల చేసింది.

Latest Videos

undefined

2023, జనవరి 1 నాటికి 15 సంవత్సరాలు పూర్తి కానున్న పిల్లలు కూడా 15-18 ఏళ్ల కేటగిరి కింద టీకా తీసుకునేందుకు అర్హులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు, మార్గదర్శకాల రూపంలో ఇంతకుముందు వివిధ సమాచారాలను అందించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
తాజాగా 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారికి సంబంధించిన వ్యాక్సినేషన్​ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ‌. దీనిలో 2007 లేదా అంతకు ముందు జన్మించిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకునేందుకు అర్హులు అని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది.

 అంతేగాకుండా .. 01.01.2023 నాటికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం 2005, 2006, 2007 సంవత్సరాల్లో జన్మించిన వారు టీకా వేయించుకోవడానికి అర్హులు కానున్నారు.15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్​లో నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రకటించారు. దీంతో జనవరి 3న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

Co-WIN వెబ్‌సైట్‌లో తరచుగా అడిగే ప్రశ్నలకు కూడా స‌మాధానాల‌ను  సంబంధిత నిబంధనలు కూడా వివరించబడ్డాయి. అలాగే.. 1962 సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరాలలో జన్మించిన కూడా అర్హుల‌ని వివ‌రించింది.   అంటే 01.01.2021 నాటికి 60 ఏళ్లు నిండిన లేదా 60 ఏళ్లు నిండే వారు కూడా అర్హులేన‌ని లేఖలో పేర్కొన్నారు.

click me!