12వ ఫ్లోర్ నుంచి కిందపడి బాలుడి దుర్మరణం.. ఫస్ట్ బర్త్‌డే రోజే విషాదం

Published : Aug 24, 2021, 04:03 PM IST
12వ ఫ్లోర్ నుంచి కిందపడి బాలుడి దుర్మరణం.. ఫస్ట్ బర్త్‌డే రోజే విషాదం

సారాంశం

గ్రేటర్ నోయిడాలో ఓ కుటుంబం అనుకోని విషాదం నెలకొంది. సత్యేంద్ర కసానా కొడుకు రివాన్ తొలి పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా పిల్లాడు 12వ అంతస్తు నుంచి నేరుగా కిందపడి అక్కడికక్కడే మరణించాడు.   

న్యూఢిల్లీ: ఇల్లంతా సందడిగా ఉంది. రివాన్ తొలి పుట్టిన రోజు వైభవంగా జరపడానికి రూమ్ అంతా డెకరేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. చుట్టాలు వచ్చేస్తున్నారు. చిన్నపిల్లల కేరింతలు, అమ్మల వంటకాలు, పెద్దోళ్ల ముచ్చట్లు వెరసి అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. కానీ, ఇంతలోనే రివాన్ కనిపించకుండా పోయాడు. గదంతా వెతికారు. వారుంటున్న 12వ ఫ్లోర్ మొత్తం గాలించారు. పిల్లాడి ఆచూకీ లేదు. వారి మదిలో ఏదో కీడు శంకించింది. తీరా చూసే సరికి 12వ అంతస్తులోని వారి గదికి సమీపంలోని మెట్ల చుట్టూ ఉండే గ్రిల్స్ నుంచి దూరి నేరుగా కిందపడి మరణించినట్టు తెలిసి హతాశయులయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని కాసా గ్రీన్స్ 1 హౌజింగ్ సొసైటీలో చోటుచేసుకుంది.

సత్యేంద్ర కసానా ఇళ్లు అలంకరించడంలో మునిగిపోయి కొడుకు రివాన్‌ను చూడలేదు. చిన్నారి రివాన్ ఫ్లాట్ బయట ఉండే కామన్ ఏరియాలో కొంత సేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత మెట్ల దగ్గరున్న గ్రిల్స్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ గ్రిల్స్ నుంచే నేరుగా 12 అంతస్తుల నుంచి నేలపై పడ్డాడు. 

కుటుంబీకులు వెంటనే రివాన్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రివాన్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. తొలి పుట్టిన రోజును ఘనంగా చేసుకుందామనుకున్న ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?