
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ నీచపు పనికి పాల్పడ్డారు. స్కూల్ ఆవరణలోనే మహిళా టీచర్‌తో రాసలీలలు సాగించాడు. అయితే గ్రామస్తులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడంతో అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం ప్రిన్సిపాల్ రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన లైంగిక దుష్ప్రవర్తను పాల్పడిన ప్రిన్సిపాల్‌ను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
కంకేర్ జిల్లాలోని ఇంద్రప్రస్థ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజేష్ పాల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను తన రాసలీలలు సాగించే అడ్డగా మార్చుకున్నాడు. అక్కడ రహస్యంగా మహిళా టీచర్‌తో లైంగిక కోరికలు తీర్చుకోవడంతో పాటు, వ్యక్తిగత ఆనందాన్ని పొందేవాడు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు. అయితే పాఠశాలలో ఏదో అక్రమం జరుగుతుందని పసిగట్టిన కొందరు గ్రామస్తులు.. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రిన్సిపాల్, మహిళా టీచర్ మధ్య లైంగిక సంబంధాన్ని బట్టబయలు చేశారు. వారి రాసలీలలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరోవైపు ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అయింది. అందులో ప్రిన్సిపాల్.. గుర్తు తెలియని ఓ వ్యక్తితో వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో లీక్ చేయకుండా ఉండాలని కోరాడు. అతనికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా ప్రిన్సిపాల్ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు అందిందని జిల్లా విద్యాశాఖాధికారి టీఆర్ సాహు తెలిపారు. ఇక, విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ గురువారం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.
ఇక, ఈ ఘటనపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ చందన్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. అకృత్యాలను మానేసి. పాఠశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్‌ను హెచ్చరించినా పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్తులు చెప్పారు. హెచ్చరికలను పట్టించుకోకుండా చివరకు సస్పెన్షన్‌కు గురయ్యారని తెలిపారు.