
ఓ అమ్మాయిని అంగట్లో సరుకు చేసేశారు. కనీసం మనిషి అనే కనికరం కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు. ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌కు చెందిన ఓ 18 ఏండ్ల యువతి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో చేస్తూ సాయంగా ఉండేది. అయితే ఆ యువతి వ్యవసాయ పనులు చేయడం ఇష్టపడని బంధువు ఒకరు మంచి ఉపాధి చూపిస్తానని చెప్పి మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.
డబ్వులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టి కిడ్నాపర్లు అయిన ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసింది ఆమెను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లిన దంపతులే అని విచారణలో తేలింది.
ఆ తర్వాత యువతిని ఏడు నెలల క్రితం రూ. 20 వేలకు ఛత్తార్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి అమ్మారు. ఇక ఏడు నెలల కాలంలో ఆమెను ఏడు మందికి అమ్మేశారు. చివరకు యూపీలోని లలిత్‌పూర్‌కు చెందిన సంతోష్ కుష్వాహాకు రూ. 70 వేలకు అమ్మారు. సంతోష్ తన కుమారుడైన బాబ్లూ కుష్వాహా(మానసిక వికలాంగుడు)కు యువతితో బలవంతంగా పెళ్లి జరిపించాడు. తనకు జరిగిన ఘోర అవమానం భరించలేక గతేడాది సెప్టెంబర్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.