Chhattisgarh: మృత్యుంజ‌యుడు..104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. బోరుబావిలో ప‌డిన బాలుడిని రక్షించిన ఆర్మీ

Published : Jun 15, 2022, 03:59 AM IST
Chhattisgarh: మృత్యుంజ‌యుడు..104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. బోరుబావిలో ప‌డిన బాలుడిని రక్షించిన ఆర్మీ

సారాంశం

Boy falls into borewell: ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 11 ఏళ్ల బాలుడిని మంగళవారం రాత్రి రక్షించారు. 104 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.  

Chhattisgarh Boy falls into borewell : చిన్నారులు బోరుబావి పడి మరణించిన సంఘటనలు అనేకం చూశాం.  ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో అధికారులు ఎంత కష్టపడిన వారి ప్రాణాలను కాపాడ‌లేక‌పోయార‌నే ఉదంతాల‌ను విన్నాం. ఇలా బోరుబావిలో చిన్నారులు ప‌డిన ఘ‌ట‌నల్లో అధిక శాతం ప్రాణాలు కోల్పోయి.. విషాదం మిగిల్చిన సంద‌ర్భాలు అధికం. కానీ, ఛత్తీస్ గఢ్ లో ఓ అద్భుతం జ‌రిగింది. బోరుబావిలో పడిపోయిన 11 ఏళ్ల బాలుడు దాదాపు 104 గంట‌ల పాటు మృత్యుడుతో పోరాడి.. సజీవంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో ఈ కుర్రాడు నిజంగానే మృత్యుంజయుడు అంటూ కీర్తిస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 11ఏళ్ల బాలుడిని 104 గంటల పాటు సుదీర్ఘ శ్ర‌మించి.. మంగళవారం రాత్రి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు.  జిల్లాలోని మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాహుల్ సాహు అనే బాలుడు తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ 80 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు.

ఈ విష‌యం తెలుసుకున్న స‌హాయ‌క సిబ్బంది.. దాదాపు 104 గంట‌ల పాటు నిర్విరామంగా శ్ర‌మించి.. బాలుడిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. ఈ స‌హాయ‌క చ‌ర్య‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఇండియన్ ఆర్మీ మరియు స్థానిక పోలీసులతో సహా దాదాపు 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆ బాలుడు సుమారు 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు మరియు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. రక్షించిన రాహుల్‌ను వెంటనే బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

బాలుడి పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీఎంఓ తెలిపింది. ప్రాథమిక పరీక్షలో బీపీ, షుగర్, హార్ట్ రేట్ నార్మల్‌గా ఉన్నాయని, ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంద‌ని వైద్యులు చెప్పారు. బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రిలో అన్ని సన్నాహాలు చేయబడ్డాయి. ఆ బాలుడిని వెంట‌నే బిలాస్‌పూర్ లోని అపోలో ఆస్పత్రికి త‌ర‌లించారు. 

ఈ ఘ‌ట‌న‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూేష్ బఘెల్ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఫ‌లించాయి. రెస్క్యూ టీమ్ యొక్క అవిశ్రాంత కృషి, అంకితభావంతో కూడిన ప్రయత్నాలతో.. రాహుల్ సాహును సురక్షితంగా బయటప‌డ్డారు. వీలైనంత త్వరగా ఆ బాలుడు కోలుకోవాలని ఆకాంక్షించారు. 

సిఎం బఘేల్ మరో ట్వీట్‌లో ఇలా అన్నారు. ఆ బాలుడు చాలా ధైర్యవంతుడు. ఇరుకైన ఆ బోరుబావిలో 104 గంట‌ల‌పాటు..పైగా త‌న‌తో చూట్టు ఓ పాము తిరుగుతున్న..  చాలా ధైర్యంగా ఉన్నాడ‌ని ప్ర‌శంసించారు.  నేడు ఛత్తీస్‌గఢ్ మొత్తం పండుగను జరుపుకుంటుందనీ, త్వరలోనే ఆ బాలుడు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి  తిరిగి రావాలని కోరుకుంటున్నామని, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్ అందరికీ మరోసారి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. 

ఈ ఘ‌ట‌న పై జాంజ్‌గీర్ జిల్లా కలెక్ట‌ర్ జితేంద్ర శుక్లా మాట్లాడుతూ..  "మేము గెలిచాము, మా జట్టు గెలిచింది, ఇది సవాలుతో కూడిన పరిస్థితి, మాకు పరిపాలన నుండి అన్ని రకాల సహాయాలు అందించబడ్డాయి. సిఎం భూపేష్ బఘేల్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. మేము నేరుగా రాహుల్‌ను తీసుకువెళుతున్నాము. బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి." ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది అని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్