
డాక్టర్, ఇంజనీర్, ఇతర ప్రభుత్వోద్యోగాలు మాత్రమే గొప్పవని భావించే వారు చాలా మందే ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది ఇలాంటి జాబ్స్ కోసమే ఆరాపడుతుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తనకు ఇష్టమైన వంటలను చేస్తూ.. చెఫ్ అనే నిరాడంబరమైన వృత్తిని ఎంచుకున్నాడు. అతను వృత్తిని ఈ ఫ్యాషనబుల్, డిమాండ్ ఉన్న వృత్తుల్లో ఒకటిగా మార్చాడు. అతనెవరో కాదు ప్రముఖ సెలబ్రిటీ చెఫ్, వ్యాపారవేత్త అయిన సంజీవ్ కపూర్.
ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ను నిర్వహించిన ప్రపంచంలోనే మొదటి చెఫ్ గా గుర్తింపు పొందడం నుంచి పద్మశ్రీ అవార్డును గెలుచుకోవడం, 50 రెస్టారెంట్లను సొంతం చేసుకోవడం వరకు సంజీవ్ కపూర్ భారతీయ పాక ప్రపంచంలో తనకుంటూ ఒ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
సంజీవ్ కపూర్ 1964లో అంబాలాలో జన్మించారు. ఇతని తండ్రి ఎస్బీఐలో పనిచేసేవాడు. ఇతను ఢిల్లీ, మీరట్, సహారన్ పూర్ లతో సహా బదిలీ అయిన ప్రదేశాలలో సంజీవ్ ఎన్నో స్కూల్స్ మారాడు. సంజీవ్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఆర్కిటెక్చర్ లో వృత్తిని కొనసాగించాలని అనుకున్నాడు. కానీ అతను ఊహించని రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. కానీ అదే అతన్ని ఈ నాడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరిని చేసింది.
సంజీవ్ కపూర్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ లోకి ఎలా వచ్చాడు?
1980వ దశకంలో సంజీవ్ స్నేహితుల్లో ఒకరైన జస్మిత్ సింగ్ హోటల్ మేనేజ్ మెంట్ కోసం దరఖాస్తును నింపుతున్నాడు. అక్కడే ఉన్న సంజీవ్ తన స్నేహితుడిని స్ఫూర్తిగా తీసుకుని హోటల్ మేనేజ్ మెంట్ ఫామ్ ను తనపేరుమీదా కూడా నింపాడు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన సంజీవ్ కు పూసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో ప్రవేశం లభించింది. దీంతో ఇతను వండటం, వడ్డించడం, క్యాటరింగ్, అకౌంటింగ్ మొదలైన వాటిపై ఎంతో పరిజ్ఞానం పొందాడు. తన హోటల్ మేనేజ్ మెంట్ శిక్షణ అంతటా. క్యాటరింగ్, ఫుడ్ సర్వీస్ శిక్షణలో భాగంగా సంజీవ్ 1982 ఆసియా గేమ్స్ సందర్భంగా వేలాది మంది పోటీదారులకు పైనాపిల్ జ్యూస్ ను అందించాడు.
సంజీవ్ కపూర్ భారతదేశపు మోస్ట్ వాంటెడ్ చెఫ్ గా ఎలా మారాడు?
సంజీవ్ కపూర్ మంచి ప్రతిభావంతుడు. జీవితంలో మంచి పొజీషన్ కు వెళతానని గట్టి నమ్మకమున్న వ్యక్తి. ఇతని నమ్మకంతోనే పాక ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. సంజీవ్ డిగ్రీ పొందిన తర్వాత 1984లో ఐటీడీసీ హోటల్స్ తో చేరారు. ఐటీడీసీ వారణాసి చెఫ్ స్టాఫ్ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏండ్లు మాత్రమే.
ఇక జీ టీవీ నుంచి కుకింగ్ షో హోస్ట్ గా ఈయనకు ఆఫర్ వచ్చింది. దీంతో సంజీవ్ కపూర్ జీవితం పూర్తిగా మారిపోయింది. జీ టీవీ కుకింగ్ ప్రోగ్రామ్ పేరు "ఖానా ఖాజానా" అని సంజీవ్ సూచించాడు. ఈ షోకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. 120 దేశాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆసియాలోనే అత్యధిక కాలం ప్రసారమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి 2010 లో 500 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.
ప్రపంచానికి తన రుచులను పరిచయం చేస్తూ సంజీవ్ కపూర్ చివరికి భారతదేశపు టాప్ చెఫ్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆహార ప్రియులు, గృహిణులు, ఔత్సాహిక చెఫ్ లు ఆయనను వంటలను చూడటం మొదలుపెట్టారు. 2011 లో సంజీవ్ కపూర్ ఫుడ్ ఫుడ్ ఛానెల్, 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టైన్ ఛానెల్ ను ప్రారంభించాడు. సొంత నిర్మాణ సంస్థ అయిన పసుపు విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ను కూడా ప్రారంభించారు. సంజయ్ కపూర్ తన వండర్ చెఫ్ కుక్ వేర్ బ్రాండ్ ను పరిచయం చేశారు. అంతేకాకుండా సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ను కూడా స్థాపించారు. సంజీవ్ కపూర్ వెంచర్ల విలువ రూ.1,000కు పైగా ఉంటుందని ఈటీ నివేదిక గతంలో పేర్కొంది.
సంజీవ్ కపూర్ కు పలు అవార్డులు
సంజీవ్ కపూర్ పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో 918 కిలోల కిచిడీని లైవ్ లో వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇతనికి ప్రభుత్వం "బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా" జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అంతేకాదు ఈయన రెండు ఐటీఏ అవార్డులు కూడా అందుకున్నారు.
సంజీవ్ కపూర్ వ్యక్తిగత జీవితం, వివాహం, పిల్లలు
సంజీవ్ కపూర్ తన కంపెనీలో పనిచేసే అలియోనాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
నికర విలువ, ఆస్తులు:
కపూర్ బ్రెయిన్ చైల్డ్, వండర్ చెఫ్ 14 దేశాలలో ఇంటి పేరుగా మారింది. ఇది వంటగదికి కావాల్సిన ఉపకరణాలు, పాత్రలు, ఇతర వంట నిత్యావసరాలను అందిస్తుంది. గత ఏడాది రూ.700 కోట్లు, అంతకిందటి ఏడాది రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఎదుగుదల కపూర్ విజయానికి నిదర్శనం.
తినుబండారాల నుండి సామ్రాజ్యాల వరకు
1998లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దుబాయ్ లో తన తొలి రెస్టారెంట్ ను ప్రారంభించడంతో కపూర్ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. ఈ పాక వెంచర్ అతని సామ్రాజ్యం ఆవిర్భావాన్ని సూచిస్తోంది. ఈయన కేవలం భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా తన రెస్టారెంట్లను ప్రారంభించాడు.
సంపన్నుల జాబితా పెంపు
సంజీవ్ కపూర్ వంట నైపుణ్యం అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించిపెట్టడమే కాకుండా భారతదేశంలోని సంపన్న చెఫ్లలో ఒకరిగా తన స్థానాన్ని సంపాదించింది. స్టాటిస్కా ప్రకారం.. 2019 లో కపూర్ రూ .24.8 కోట్ల ఆదాయంతో భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్ గా అగ్రస్థానంలో నిలిచాడు.