జర్నలిస్టులపై మావోల ఆగ్రహం.. ఆ ఐదుగురికి శిక్ష తప్పదని హెచ్చరిక...

Published : Feb 19, 2021, 03:25 PM IST
జర్నలిస్టులపై మావోల ఆగ్రహం.. ఆ ఐదుగురికి శిక్ష తప్పదని హెచ్చరిక...

సారాంశం

మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్న ఐదుగురు జర్నలిస్టులకు శిక్ష తప్పదంటూ మావోయిస్టులు హెచ్చరించారు. దీంతో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల్లో కలకలం మొదలయ్యింది. 

మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్న ఐదుగురు జర్నలిస్టులకు శిక్ష తప్పదంటూ మావోయిస్టులు హెచ్చరించారు. దీంతో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల్లో కలకలం మొదలయ్యింది. 

రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్ పార్టీకి, మీడియాకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధులు మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. 

బస్తర్ దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను వెళ్లగొట్టి, ఆ ప్రాంతంలో ఉన్న విలువైన గనులను దోచుకోవడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపిస్తుంది. అందులో భాగంగానే అటవీ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తూ.. ఆదివాసీలపై దాడులు చేస్తూ, వారిని వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని  పేర్కొంది. 

ఈ వ్యవహారంలో కొందరు సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని చెబుతూ బీజాపూర్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ మిశ్రా, లీలాధర్‌రథి, విజయ్, ఫారూఖ్‌ అలీ, సుబ్రాస్తు చౌదరి పేర్లను ప్రస్తావించింది. వీరు ఆ అవినీతిపరులని, కార్పొరేట్ శక్తులకు బ్రోకర్లని, వీరిని ప్రజాకోర్టులో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారంటూ పార్టీ తన లేఖలో పేర్కొంది. 

దీంతో బస్తర్‌ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అయితే ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇదేమీ కొత్త కాదు. రెండున్నరేళ్ల క్రితం బీజాపూర్ జిల్లాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సాయిరెడ్డితోపాటు అదే జిల్లాకు చెందిన మరొక జర్నలిస్టులను మావోయిస్టులు అనుమానంతో హతమార్చారు. 

మావోయిస్టులకు కొన్నిసార్లు తప్పుడు సమాచారం అందుతుందని దీనివల్లే ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌ జర్నలిస్టులపై మావోలు చేసిన ఆరోపణలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మావోలకు అందే తప్పుడు సమాచారం వల్ల కిడ్నాప్‌లకు గురైన పలువురు అమాయక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల పక్షాన నిలిచి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి దండకారణ్యానికి వెళ్లి చర్చలు జరిపారని గుర్తు చేశారు. 

ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేని జర్నలిస్తులపై  ఆరోపణలు సరికాదని, ఈ ఆరోపణలను ఖండిస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల హెచ్చరికలను వెనక్కి తీసుకోవలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. 

స్థానిక జర్నలిస్టులు చేస్తున్న ఈ డిమాండ్ కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన జర్నలిస్టు సంఘాలు మద్దతునిచ్చి ఆందోళనల్లో పాల్గొన్నాయి. దీంతో మావోయిస్టులు అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మావోయిస్టు పార్టీ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు వద్దని, పరిస్థితిపై సామరస్యంగా చర్చించుకుందామని కోరింది. 

PREV
click me!

Recommended Stories

Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ దక్షిణాదిలోనే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
ఘనంగా గణతంత్ర వేడుకలు | ప్రధాని మోడీ సెక్యూరిటీ చూశారా | Republic Day 2026 | Asianet News Telugu