ఆస్పత్రి బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా మహిళను వీడియో తీసి..

Published : Feb 19, 2021, 11:39 AM ISTUpdated : Feb 19, 2021, 12:28 PM IST
ఆస్పత్రి బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా మహిళను వీడియో తీసి..

సారాంశం

ఉలవాలా ప్రాంతానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది


ఓ మహిళ తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆస్పత్రిలో చేర్పించింది. తన తండ్రిని జాగ్రత్తగా చూసుకునేందుకు తాను కూడా అదే ఆస్పత్రిలో ఉంటుంది. కాగా.. మహిళ ఉన్న పరిస్థితిని పసిగట్టి ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మహిళ బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉలవాలా ప్రాంతానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది. కాగా... అదే ఆస్పత్రిలో ఉండే బాత్రూమ్ లో మహిళ స్నానం చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరో తనను వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు మహిళ గుర్తించింది. దీంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చింది. 

కాగా.. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. వెంటనే బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడు అబ్దుల్ మునీర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu