చార్ ధామ్ యాత్రకు విడుదలైన నూతన మార్గదర్శకాలు.. ఇవి తప్పనిసరి

By telugu teamFirst Published Oct 6, 2021, 5:54 PM IST
Highlights

చార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దైవ దర్శనం చేసుకోవాలని భావించే భక్తులందరూ తప్పనిసరిగా ఈపాస్ కలిగి ఉండాలని, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. కరోనా టెస్టు నెగెటివ్ రిపోర్టు కచ్చితంగా ఉండాలని వివరించింది.
 

న్యూఢిల్లీ: చార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం బుధవారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. కేదార్‌నాథ్ ధామ్, బ్రదినాథ్ ధామ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకోవడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. సందర్శించే భక్తుల సంఖ్యపై లిమిట్ విధించాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. చార్ ధామ్ యాత్రపై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దర్శనం కోసం ఈపాస్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భక్తులు కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్టు రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఈ రిపోర్టు 72 గంటలకు ముందే తీసుకుని ఉండాలని వివరించింది. చార్ ధామ్ సందర్శించాలని భావించిన భక్తులందరికీ ఇది తప్పనిసరి. ఈ నిబంధనల ప్రకారం భక్తులందరూ కచ్చితంగా మాస్కు ధరించాలి.

కేదార్‌నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను దర్శించాలనుకునే భక్తుల సంఖ్యపై లిమిట్ విధించవద్దని హైకోర్టు ఈ నెల 5న ఆదేశించింది. భక్తులు కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టు లేదా వ్యాక్సిన్ తీసుకున్న రిపోర్టు కలిగి ఉండాలని వివరించింది.

click me!