ఆఫ్ఘనిస్తాన్‌లో మారిన పరిణామాలు సవాలే: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

By narsimha lodeFirst Published Aug 29, 2021, 3:13 PM IST
Highlights


ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకొన్న పరిణామాలతో  తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకొంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆగష్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకొన్నారు.  దీంతో ఆ దేశం నుండి వచ్చేందుకు వందలాది మంది కాబూల్ ఎయిర్ పోర్టు వ్ద ఎదురు చూస్తున్నారు.


న్యూఢిల్లీ: ఆప్టనిస్తాన్‌లో మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలేనని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకొన్న తర్వాత చోటు చేసుకొన్న ఉద్రిక్త పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తాలిబన్లు ఆక్రమించుకొన్న తర్వాత ఆఫ్గానిస్తాన్‌లో మారిన సమీకరణాలు ఇండియాకు సవాలేనని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సిందేనని వచ్చిందని  కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకొన్న పరిణామాలపై భారత్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందన్నారు.  ఈ  విషయమై భారత విదేశాంగ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో చర్చలు జరిపిన విషయాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.

యుద్ధ సమయంలో  అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటేడ్ బ్యాటిల్ గ్రూప్ ఏర్పాటుకు రక్షణ శాఖ ఆలోచన చేస్తోందని ఆయన చెప్పారు. యుద్ధ బృందాల సంఖ్యను కూడ పెంచుతామని ఆయన చెప్పారు.

click me!