భూ కక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3.. విజయవంతంగా ముగిసిన ప్రక్రియ

Siva Kodati |  
Published : Aug 05, 2023, 08:15 PM ISTUpdated : Aug 05, 2023, 08:17 PM IST
భూ కక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3.. విజయవంతంగా ముగిసిన ప్రక్రియ

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో శనివారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో శనివారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. శనివారం సాయంత్రం 7.15 గంటలకు ఇస్రో ఈ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. 18 రోజుల పాటు చంద్రుని కక్ష్యలో తిరిగిన అనంతరం ఈ నెల 23 లేదా 24న చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. 

 

 

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం( ఇస్రో) చంద్రయాన్ 3 జూలై 14న ప్రయోగించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ గతంలో అన్వేషించని చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3వ సారి విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా, చైనా, రష్యా అనే మూడు దేశాలు మాత్రమే ఇప్పటివరకు చంద్రుని ఉపరితలంపైకి సురక్షితంగా వెళ్లాగలిగాయి. చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి..చంద్రునిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించాలని భావిస్తుంది

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations