Chandrayaan 3:ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను పెంచుతుంది.. శాస్త్రవేత్తల అలుపెరగని అంకితభావానికి నిదర్శనం: మోడీ

Published : Jul 14, 2023, 03:19 PM ISTUpdated : Jul 14, 2023, 03:55 PM IST
Chandrayaan 3:ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను పెంచుతుంది.. శాస్త్రవేత్తల అలుపెరగని అంకితభావానికి నిదర్శనం: మోడీ

సారాంశం

Chandrayaan-3 launch: చంద్రయాన్-3 దేశ ప్రజల ఆశలు, కలలను సాకారం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. 2019లో విఫలమైన చంద్రయాన్-2 మిషన్ తరువాత సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా భారతదేశం చేసిన రెండవ ప్రయత్నం ఇది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కావడానికి ముందు విజయవంతంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించింది. శ్రీహరికోట ఇస్రో  ప్రయోగ కేంద్రం నుండి  ఎల్‌వీఎం-3 రాకెట్  ను ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మెన్  సోమనాథ్  ప్రకటించారు.

India's Chandrayaan-3: చంద్రయాన్-3 దేశ ప్రజల ఆశలు, కలలను సాకారం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. 2019లో విఫలమైన చంద్రయాన్-2 మిషన్ తరువాత సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా భారతదేశం చేసిన రెండవ ప్రయత్నం ఇది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కావడానికి ముందు విజయవంతంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించింది. శుక్రవారం (జూలై 3) చంద్రయాన్ -3 ప్రయోగానికి భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముఖ్యమైన చంద్ర మిషన్ దేశ ఆకాంక్షలు, ఆశయాలను కలిగి ఉందని ఆయన నొక్కి చెప్పారు.భారత అంతరిక్ష రంగానికి సంబంధించి 14 జూలై 2023 ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశ ఆశలు-కలలను తీసుకువెళుతుందని అన్నారు.

యావత్ దేశం ఆశలను మోసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైతే రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రుడిపై నియంత్రిత ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. బాహుబలి రాకెట్ గా పిలిచే మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ లో విక్రమ్ ల్యాండర్ ఉంది. నింగిలోకి విజ‌య‌వంతంగా ప్ర‌యోగం జ‌రిగిన‌ట్టు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ విజ‌యం త‌ర్వాత ప్ర‌ధాని మోడీ స్పందిస్తూ.. "చంద్రయాన్-3 భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇది ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను పెంచుతుంది. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల అలుపెరగని అంకితభావానికి నిదర్శనం. వారి స్ఫూర్తికి, చాతుర్యానికి సెల్యూట్ చేస్తున్నాను" అని పేర్కొన్నారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu