మాకు అండగా నిలిచినందుకు దన్యవాదాలు... ఇస్రో

By telugu teamFirst Published Sep 18, 2019, 8:08 AM IST
Highlights

జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రునిపైకి వెళ్లిన తర్వాత సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. కాగా... విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన అనంతరం తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ ఇస్రో దన్యావాదాలు తెలియజేసింది. ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ లో పేర్కొంది.

‘ మాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ దన్యావాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలలు స్ఫూర్తితో మేము మరింత ముందుకు సాగుతాం’. అని ఇస్రో ట్వీట్ చేసింది.

జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూ కేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 

click me!