మమత దీక్షను విరమింపజేసిన బాబు

Published : Feb 05, 2019, 06:42 PM IST
మమత దీక్షను విరమింపజేసిన బాబు

సారాంశం

కేంద్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఆరోపించారు.  


కోల్‌కతా: కేంద్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఆరోపించారు.

మంగళవారం నాడు కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమత బెనర్జీతో  చంద్రబాబునాయుడు దీక్ష విరమింపజేశారు.తన రాజకీయ జీవితంలో  ఈ తరహా పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు.

త్వరలోనే తామంతా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు.  భవిష్యత్తులో ఏ సమస్య జరిగినా తనతో పాటు మమత బెనర్జీ, రాహుల్ గాంధీ లాంటి నేతలతో ఎన్డీఏ పక్షాలు కలిసి రానున్నాయని బాబు చెప్పారు.ఏపీ, బెంగాల్, ఢిల్లీ అభివృద్ధిని  అడ్డుకొంటున్నారని బాబు ఆరోపించారు. బెంగాల్ ప్రజలంతా  మమతకు అండగా నిలిచారని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu